తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించిన తర్వాత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి పనులు చేశారని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. మూడోసారి గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు. పని చేసిన, అభివృద్ధి చేసిన ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజల పైన ఉన్నది. ఖమ్మం జిల్లా బిడ్డగా నా జీవితంలో ఎప్పుడు చూడని అభివృద్ధి 9 సంవత్సరాలలో జరిగింది. ఒకప్పుడు గుడేలకి, తండాలకి రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు లేకుండే. మంచినీళ్లు లేకుండే… మిషన్ భగీరథ ద్వారా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్ళు ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజనులకు లక్షన్నర ఎకరాల పట్టాలు ఇచ్చిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. దశాబ్దాలుగా గతంలోని ప్రభుత్వాన్ని పట్టించుకోని పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులకు ఎనలేని సహాయం చేశారు.
ఖమ్మం జిల్లాలో ఎవరికి టికెట్ ఇచ్చిన పార్టీ సైనికులుగా పనిచేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. రానున్న మూడు నెలల్లో ప్రతి ఇంటి గడపకు వెళ్లి… అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉన్నది. రాబోయే మన ప్రభుత్వంలో మన ఎమ్మెల్యేలే ఉంటే అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉన్నది. మన పార్టీ ఎమ్మెల్యేలు మన ప్రభుత్వంలో ఉంటే పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. ప్రజల ఆకాంక్షలు వేగంగా నెరవేరుతాయని అన్నారు.పార్టీ ద్వారా పెద్దవాళ్ళు అయి పార్టీకి ద్రోహం చేసిన కొంతమంది నాయకులు… ముఖ్యమంత్రి పైన కేటీఆర్ పైన విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని నాయకులు… నేడు తెలంగాణ అమరవీరుల గురించి తెలంగాణ ఉద్యమం గురించి మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే స్థాయి మీకు లేదు అనే విషయం గుర్తుంచుకుంటే మంచిదని అన్నారు.