నడుచుకుంటూ వస్తున్న మహిళపై పోలీసు వాహనంలో ఎక్కించుకొని మరి ఎల్బీనగర్ పోలీసులు ప్రతాపం చూపించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచుకొని చిత్రహింసలు గురిచేసి ఉదయం పంపించారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఘటన చోటు చేసుకుంది. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీ నంది హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4 లో ఉంటున్న వర్త్య లక్ష్మితన కూతురు పెళ్లి కోసం ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ రోడ్డు వైపు లోని బంధువుల ఇంటికి డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది.
ఆగస్టు 15 మంగళవారం రాత్రి తిరిగి ఎల్బీనగర్ వస్తుండగా ఎల్బీనగర్ సర్కిల్లో పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తరలించి ఆమెను చిత్రహింసలు కి గురిచేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆమె ఎదురు తిరిగితే నీ సంగతి తెలుసు అంటూ నానా ఇబ్బందులు గురిచేసి రాత్రంతా వదలకుండా ఉన్నారని అన్నారు… ఉదయం ఏడు గంటలకు వేరే ఆఫీసర్ వచ్చి ఇంటికి పంపించాడని వాపోయింది.