తెలంగాణ భవన్ లో ఖమ్మం జిల్లా చేరికల సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పాల్గోన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భారత రాష్ట్ర సమితిలో తిరిగి చేరారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వెళ్లడం అంటే కుక్కను పట్టుకొని గోదారిని ఈదడం లాంటిదనే విషయం మన వెంకట్రావు కి నెల రోజుల్లోనే అర్థమైంది. పార్టీలో తిరిగి చేరుతున్నందుకు ఆయనకు అభినందనలు. ఆయనతోపాటు ఆయన ద్వారా చేరిన పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్తును పార్టీ చూసుకుంటుంది. ఒకప్పుడు కొమురం భీం కోరుకున్న జల్, జంగల్, జమీన్ నినాదం స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నది.
ఒక్క వర్షాకాలంలోనే కోటి ఎకరాల జమీన్ లో పంటను తెలంగాణ ఈరోజు సాగు చేస్తుంది. తెలంగాణ మొత్తంగా భూమాత పచ్చ చీర కట్టుకున్నదా అన్న తీరుగా పంటలు పండిస్తున్నది మన రైతాంగం. ఒకప్పుడు మనం అనుకునే తెలంగాణ కోటి రతనాల వీణ… ఈరోజు కోటి ఎకరాల మాగానంగా మారింది. ఇది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. ఒకప్పుడు మంచం పట్టిన మన్యం అనే వార్తలు వస్తుండే …ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉన్నదా… ఇంటింటికి నీరు ఇవ్వాలన్న లక్ష్యాన్ని సాధించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. మన ముఖ్యమంత్రి జాతిని మేల్కొల్పిన తర్వాత మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని జల్జీవన్ మిషన్ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది కాంగ్రెస్ పాలిత చతిస్గడ్ రాష్ట్రంలో… గోదావరి అవతల ఉన్న ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా . మరి తెలంగాణలో నాలుగు లక్షల 50 వేలు ఎకరాల పోడుభూమి పట్టాలు ఇచ్చినట్లు ఛత్తీస్గడ్ల ఇచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న చత్తీస్గడ్ లో రైతుబంధు రైతు బీమా ఉన్నదా .
24 గంటల ఉచిత విద్యుత్తు వ్యవసాయ రంగానికి అక్కడ ఉన్నదా . పండించిన పంట మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం కొంటె మరి కాంగ్రెస్ చత్తీస్గడ్ లో కొంటున్నదా. కాంగ్రెస్ పాలిత చత్తీస్గడ్ రాష్ట్రం నుంచి రైతులు తెలంగాణకు వచ్చి తమ పంటను అమ్ముకుంటున్నారు. మరి రైతులకు సహాయం చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలి . కమ్యూనిస్టులు, నక్సలైట్లు ఒకప్పుడు చెప్పిన సమస్య స్థాపన ఇప్పుడు జరుగుతున్నది. రాష్ట్రంలో పెరుగుతున్న సంపద… సృష్టించబడుతున్న సంపద… పట్టణాలు.. పల్లెలల అంతరం లేకుండా పెరుగుతున్నది. అన్ని వర్గాల వారికి… సమాజంలోని అందరికీ అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయి . 60 ఏళ్లు అధికారంలో ఉండి 200 పెన్షన్ ఇచ్చినవాడు.. ఈరోజు నాలుగు వేలు ఇస్తా అంటే ఎట్ల నమ్మాలి. అధికారంలోకి రాలేనోడు 4000 కాదు 40 వేలు ఇస్తాం అన్న ప్రజలు నమ్మరు . పేద, బిక్కి, చిన్న సన్నకారు రైతులకు మూడు గంటల కంటే ఎక్కువ కరెంటు వద్దన్న పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు.
పేద రైతులకు సంక్షేమ పథకాలు ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అవసరమా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా రైతుబంధు వస్తది. మిషన్ భగీరథ నీళ్లు వస్తవి… ఆసరా పెన్షన్ వస్తది… కల్యాణ లక్ష్మి వస్తది… షాది ముబారక్ వస్తది. అవన్నీ జేబులో పెట్టుకొని కెసిఆర్ తిట్టడం.. విమర్శ చేయడం అలవాటుగా మారింది. కాంగ్రెస్ పార్టీకి… అందులోని నాయకులకి పదవులు రాకపోవడమే ప్రజల సమస్యగా చిత్రీకరిస్తే… ప్రజలు ఆదరించరన్న విషయం కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. గిరిజనులకి 10% రిజర్వేషన్ పెంచిన ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం. పోడు భూములకు పట్టాలు ఇచ్చి ,గిరిజనులకు పంచాయతీలు ఏర్పాటు చేసి స్వయం పాలన అధికారం ఇచ్చి, రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసిఆర్ డి కాదా ఆలోచించాలి. యాదాద్రి స్థాయికి తగ్గకుండా భద్రాద్రి రామాలయ అభివృద్ధిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తారు.. కచ్చితంగా ఆ బాధ్యత మేమే తీసుకుంటాం. తిరిగి అధికారంలోకి రాగానే… భద్రాద్రి రాముడి గుడిని అద్భుతంగా పునర్నిర్మిస్తాం..ఎవరికీ ఈ అనుమానాలు అవసరం లేదు . 60 సంవత్సరాల పాటు అధికారం వెలగబెట్టి ప్రజలకు సంక్షేమం.. అభివృద్ధి అందజేయని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కొత్తగా వచ్చినట్లు మరొకసారి అవకాశం అడుగుతున్న మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించాలని అన్నారు.