ముంబై ఆగష్టు 16 బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని, మతం, వర్గాల ప్రాతిపదికన విభజిస్తోందని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య ఆయన బుధవారం ఛత్రపతి శంభాజీనగర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహాన్ని రక్షించనున్నారు.
విభజన దినోత్సవాన్ని జరుపుకోవాలనే నిర్ణయం సరికాదని పవార్ పేర్కొన్నారు.బీజేపీ ప్రభుత్వాలను అస్థిరపరుస్తోందని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌తో పాటు మహారాష్ట్రలోనూ ప్రభుత్వాలను అస్థిరపరిచిందని ఆరోపించారు. మణిపూర్ సున్నితమైన రాష్ట్రమైన, మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు దారుణమని, మణిపూర్‌పై ప్రధాని ఎక్కువ మాట్లాడి ఉండాల్సిందన్నారు.