A place where you need to follow for what happening in world cup

మణిపూర్ లో భతరమాతను చంపేశారు

న్యూఢిల్లీ, ఆగస్టు 9:ఎంపీ సభ్యత్వం పునరుద్ధరించిన తరవాత రాహుల్ గాంధీ తొలిసారి పార్లమెంట్‌లో ప్రసంగించారు. తన సభ్యత్వాన్ని రీస్టోర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదానీ వ్యవహారంపై మాట్లాడనంటూ బీజేపీపై సెటైర్లు వేశారు. ఇదే క్రమంలోనే అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన రాహుల్ గాంధీ…ముందుగా భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడారు. తన యాత్ర ఇంకా ముగిసిపోలేదని, రెండోసారి యాత్ర నిర్వహిచేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు.”లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించినందుకు స్పీకర్‌ గారికి ధన్యవాదాలు. నేను చివరిసారి మాట్లాడినప్పుడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఉంటాను. ఎందుకంటే నేను అప్పుడు అదానీ వ్యవహారంపై మాట్లాడాను. బహుశా మీ సీనియర్ లీడర్ (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) బాధ పడ్డారేమో. బహుశా ఆ బాధ మీపైన (స్పీకర్‌ని ఉద్దేశిస్తూ) కూడా ప్రభావం చూపించి ఉండొచ్చు. అందుకు నేను మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. కానీ నేను మాట్లాడింది నిజం.

కానీ ఈ సారి బీజేపీ మిత్రులు ఏం భయపడాల్సిన పనిలేదు. నేను ఇప్పుడు అదానీ గురించి మాట్లాడడం లేదు”రాహుల్ ప్రసంగిస్తుండగా బీజేపీ ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. ఆ సమయంలో రాహుల్ రూమీ కొటేషన్‌ని ప్రస్తావించారు. “మనసులో నుంచి వచ్చే మాటలు ఎప్పుడూ…మనసుని తాకుతాయి” అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.అవిశ్వాస తీర్మానాన్ని ప్రస్తావిస్తూ మణిపూర్ అంశంపై మాట్లాడారు రాహుల్ గాంధీ. మణిపూర్‌ రాష్ట్రాన్ని దేశంలో భాగంగా మోదీ సర్కార్ చూడడం లేదని విమర్శలు చేశారు. తాను మణిపూర్‌కి వెళ్లి అక్కడి బాధితులను పరామర్శించానని, ప్రధాని మోదీ మాత్రం ఇప్పటి వరకూ ఆ పని చేయలేదని విమర్శించారు. “ప్రధాని మోదీకి మణిపూర్‌ మన దేశంలోని భాగం కాదు. ఆ రాష్ట్రాన్ని మోదీ సర్కార్ ముక్కలు చేసింది” అంటూ విరుచుకు పడ్డారు. మణిపూర్‌లో భారత్‌ని హత్య చేశారంటూ తీవ్రంగా విమర్శించారు.

మణిపూర్‌లో పర్యటించినప్పుడు చాలా మంది బాధితులను ఓదార్చినట్టు వెల్లడించారు రాహుల్ గాంధీ. కళ్లముందే భర్తను కాల్చి చంపినట్టు ఓ బాధితురాలు తనతో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నట్టు వివరించారు. ప్రధాని మోదీని రావణాసురుడితో పోల్చారు రాహుల్. ఆయన అదానీ, అమిత్‌షా మాటలు తప్ప ఇంకెవరి మాటల్నీ వినిపించుకోరని అన్నారు. “ప్రధాని నరేంద్ర మోదీకి మణిపూర్‌ మన దేశంలో భాగంగానే కనిపించడం లేదు. ఆ రాష్ట్రంలో ఇండియాని బీజేపీ హత్య చేసింది. మణిపూర్ రెండు ముక్కలుగా చీలిపోయిందనేది వాస్తవం.అసలు ఇప్పుడా రాష్ట్రం ఉనికే కనిపించడం లేదు.

బీజేపీ ఎంపీలు మమ్మల్ని రాజస్థాన్‌కి వెళ్లమని సలహా ఇచ్చారు. నేను వెళ్తున్నాను. ప్రధాని మోదీ రావణాసురుడిగా మారిపోయారు. మొత్తం దేశాన్ని తగలబెడుతున్నారు. ముందు మణిపూర్‌తో మొదలు పెట్టారు. ఇప్పుడు హరియాణాలో ఇదే జరుగుతోంది. దేశం మొత్తాన్ని ఇలా తగలబెట్టాలనుకుంటున్నారు”భరత మాతపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోరు జారకూడొద్దంటూ మందలించారు. ఇటీవల తాను దేశం ఒక మూల నుంచి మరో మూలకు పాదయాత్ర చేశానంటూ భారత్ జోడో యాత్ర గురించి చెప్పుకొచ్చారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నావని చాలామంది అడిగారు.. అయితే తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేయడం వెనుక మీ లక్ష్యం ఏంటని అడిగారు. భారత దేశాన్ని అర్థం చేసుకునేందుకు, ప్రజలకు కలిసేందుకు పాదయాత్ర చేయాలనుకున్నాను అంటూ చెపాను.. అయితే తన పాదయాత్ర పూర్తి కాలేదని.. ఇక ముందు కూడా భారత్ జోడో యాత్ర కొనసాగుతుందన్నారు రాహుల్ గాంధీ.పాదయాత్ర ప్రారంభించిన మొదట్లో తనకు అహంకారం ఉండేదని గుర్తుచేసుకున్నారు. పాదయాత్ర కొనసాగుతున్న కొద్దీ తనలో అహంకారం క్రమంగా మాయమైందన్నారు. పాదయాత్రలో రోజూ విభిన్న రంగాల వారిని కలిశానంటూ చెప్పుకొచ్చారు.. సామాన్యులను, ధనవంతులను, వ్యాపారులను..

ఇలా అన్ని వర్గాలను కలిశాను. అందరితో కలుస్తూ.. అందరి మాటలు వింటూ పాదయాత్ర కొనసాగించా.. నేను నమ్మిన సత్యం కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు రాహుల్.రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై గందరగోళంరాహుల్‌ గాంధీ ప్రసంగంపై బీజేపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ ప్రసంగాన్ని అడ్డుకుంటున్న బీజేపీ సభ్యులు ప్రయత్నించారు. కొన్నిరోజుల క్రితం తాను మణిపుర్‌ వెళ్లినట్లుగా చెప్పారు. ప్రధాని మోదీ ఇప్పటి వరకు మణిపుర్‌ వెళ్లలేదన్నారు. మణిపుర్‌ పునరావాస శిబిరాల్లోని మహిళలు, పిల్లలతో తాను మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నట్లుగా చెప్పారు. మణిపుర్‌ బాధితులకు మద్దతుగా తాను రాత్రంతా వారితో గడిపానంటూ.. ఆ మహిళ చెప్పిన విషయాన్ని సభ ముందు పెట్టారు.

మన సైన్యం తలచుకుంటే మణిపుర్‌లో ఒక్కరోజులోనే శాంతి సాధ్యం..కానీ ప్రభుత్వం అలా ఆలోచించడం లేదంటూ విమర్శించారు రాహుల్ గాంధీ.భరత మాతపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోరు జారకూడొద్దంటూ మందలించారు.కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భరత మాతపై రాహుల్ అలాంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ ఎంపీలు చప్పట్లు కొట్టడం సిగ్గు చేటు అంటూ మండి పడ్డారు. ఆ పార్టీ వైఖరేంటో దీంతో తేలిపోయిందని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. “మీరు ఇండియా కానే కాదు. అవినీతిని మొదలు పెట్టిందే మీరు. ప్రస్తుతం దేశ ప్రజలు వారసత్వ రాజకీయాలను కాదు అభివృద్ధిని విశ్వసిస్తున్నారు. మీ లాంటి వాళ్లు క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకోవాల
ని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.