హైదరాబాద్;మొబైల్ ఫోన్స్ చోరికి కి పాల్పడుతున్న ముఠా సభ్యుడిని అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ సందీప్ రావు వెల్లడించారు. నిందితుని వద్ద నుండి భారీగా మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నాం. ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో సెల్ ఫోన్స్ చోరీ చేసి ముఠా నగరంలో అమ్ముతోంది. ఆంద్రప్రదేశ్ ఆకివీడు ప్రాంతానికి చెందిన ఆకాష్ ,సన్నీ, వంశీ లు మొబైల్ ఫోన్లు చోరీ చేసి హైదరాబాద్ లోని అసిఫ్, ఆర్షద్ లకు అమ్ముతున్నారు. ఆసిప్, ఆర్శద్ లు వాటిరి తిరిగి రామన్ జి కు విక్రయిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుండి చోరీ చేసిన మొబైల్ ఫోన్ లను నగరానికి తీసుకొని వచ్చి సాప్ట్ వేర్ ను మార్చి రామన్ జి విక్రయిస్తున్నాడు. పక్క సమాచారం తో రమన్ జి ను రాయదుర్గం లో అరెస్ట్ చేశాం. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుడు రామన్ జి గతంలో హైదరాబాద్ ఫలక్ నుమా డిపో లో ఆర్టీసీ కండక్టర్ గా పని చేసి మానేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భారీగా అప్పులు చేసాడు. నిందితుడి వద్ద నుండి కోటి 92 లక్షల విలువ చేసే 563 మొబైల్ ఫోన్ లు, హుండయ్ క్రెటా కార్, మూడు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని అయన వెల్లడించారు…..