న్యూఢిల్లీ, జూలై 21:2024 లోక్‌సభ ఎన్నికలు ఇంక మిగిలుంది 8 నెలలు మాత్రమే. అందుకే…అన్ని పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈసారి బీజేపీతో డైరెక్ట్ వార్ ప్రకటించిన కాంగ్రెస్ ఈ విషయంలో కాస్త ముందంజలో ఉంది. రాహుల్ గాంధీ ఇప్పుడా పార్టీకి కాస్తో కూస్తో ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. పైగా…ఇటీవలే భారత్ జోడో యాత్రతో కాస్త చరిష్మా పెంచుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. అప్పటి నుంచి రెండో విడత భారత్ జోడో యాత్రకు హైకమాండ్ ప్లాన్ చేస్తోందని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్పారు.సెప్టెంబర్‌లో భారత్ జోడో యాత్ర సెకండ్ ఫేజ్ ఉంటుందని సమాచారం. భారత్ జోడో యాత్ర రెండో విడత ప్రారంభించేందుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు మంచి బూస్ట్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. భారత్ జోడో యాత్ర రెండో విడత ఉంటుందని ఇంతకు ముందే కాంగ్రెస్ సంకేతాలిచ్చింది.
గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు రాహుల్ గాంధీ, ఇతర నాయకులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన దాదాపు 4,000 కిలోమీటర్ల ప్రయాణం తరువాత.. మరో యాత్ర కోసం పార్టీ శ్రేణుల్లో చాలా ఉత్సాహం, శక్తి ఉందని చత్తీస్ ఘడ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశాల సమయంలో చెప్పారు. ఈ సారి ఈస్ట్-టు-వెస్ట్ యాత్ర ఉంటుందని.. బహుశా అరుణాచల్ ప్రదేశ్ లోని పసిఘాట్ నుంచి గుజరాత్ లోని పోర్‌బందర్ వరకు సాగే అవకాశం ఉందని ఫిబ్రవరిలో కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ తెలిపారు. రెండో విడత యాత్ర ఆకృతి భారత్ జోడో యాత్ర తొలి విడతతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఈ మార్గంలో నదులు, అరణ్యాలు ఎక్కువగా ఉన్నందున సవాళ్లతో కూడి ఉంటుందని ఆలోచిస్తున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో నెలల పాటు సాగిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నంచి కశ్మీర్ వరకూ చేశారు. అక్కడ సభ నిర్వహించి ఆ యాత్రకు ముగింపు పలికింది కాంగ్రెస్.
ఈ జర్నీలో తాను ఎన్నో నేర్చుకున్నట్టు చెప్పారు రాహుల్ గాంధీ చాలా సార్లు చెప్పారు. అంతే కాదు. ఇది గ్రాండ్ సక్సెస్ అయిందనీ వెల్లడించారు. పాదయాత్ర పార్టీ కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం వచ్చిందని.. . అందుకే మరోసారి ఇలాంటి యాత్ర కొనసాగించాలని భావిస్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది. బెంగళూరులో రెండ్రోజుల భేటీ తరవాత విపక్షాల కూటమి UPA పేరుని మారుస్తూ అధికారికంగా ప్రకటించింది. INDIA గా మార్చుతున్నట్టు వెల్లడించింది. దీనిపై ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ఈ కూటమిలో మొత్తం 26 పార్టీలున్నాయి.
చివరి వరకూ ఎన్ని పార్టీలు గట్టిగా నిలబడతాయన్నది క్లారిటీ లేకపోయినా…పేరులో “ఇండియా”ని చేర్చి చాలా స్ట్రాటెజిక్‌గా వ్యవహరించాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం…INDIA అనే పేరుని సజెస్ట్ చేసిందెవరు అనేదే. కొంత మంది ఇది రాహుల్ గాంధీ ఐడియానే అని చెప్పినప్పటికీ పలువురు నేతలు మాత్రం దాన్ని కొట్టి పారేశారు. రాహుల్ తరవాత గట్టిగా వినిపిస్తున్న పేరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆమె సూచనతోనే ఈ పేరు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒక్కోరి వాదన ఒక్కోలా ఉంది. ఓ కాంగ్రెస్ ప్రతినిధి రాహుల్ గాంధీ సూచనతోనే ఈ పేరు పెట్టారని చెప్పగా…TMC ప్రతినిధి మమతా సలహాతోనే ఈ పేరు పెట్టారని క్లెయిమ్ చేసుకున్నాడు. మరి కొందరు మాత్రం ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అని తేల్చి చెబుతున్నారు.