సిద్దిపేట : జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డిపై కేసు నమోదు అయింది. రెండు రోజుల క్రితం మత్తడి ఆవరణ స్థలంలో 1270 గజాల స్థలం చుట్టు ఉన్న ఫెన్సింగ్ ను తుల్జాభవాని రెడ్డి కూల్చివేసిన విషయం తెలిసిందే. తన పేరుపై ఉన్న ఆ స్థలాన్ని మున్సిపాలిటికి అప్పగిస్తున్నట్లు తుల్జాభవాని చెప్పారు.
పక్కనే ఉన్న తన భూమి ఫెన్సింగ్ ని కూడా తుల్జాభవాని కూల్చివేసిందని చేర్యాల పోలీసులకు బాధిత స్థల యజమాని రాజు భాయ్ ఫిర్యాదు చేసాడు. తుల్జాభావాని రెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డే ఈ కేసు పెట్టించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.