A place where you need to follow for what happening in world cup

తెరుచుకున్న పూరీ రత్నభాండాగారం

ప్రత్యేక పూజలు నిర్వహించిన పర్యవేక్షక కమిటీ
స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో భద్రపరిచిన అధికారులు

పూరీ జగన్నాథుడి అమూల్య నిధి భద్రపర్చి ఉన్న రత్న భాండార్‌ను అధికారులు గురువారం మరోసారి తెరిచారు. 46 ఏళ్ల తర్వాత ఆదివారం తొలిసారి రత్నభాండాగారాన్ని తెరిచిన అధికారులు గురువారం మరోసారి తలుపులు తెరిచారు.  రహస్య గదిని తెరిచే ముందు పర్యవేక్షక కమిటీ ముందుగా ఆల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథుడి దర్శనం చేసుకున్న తర్వాతే మరోసారి రత్నభాండాగారాన్ని తెరిచారు. రహస్య గదిలో ఉన్న పెట్టెలోని ఆభరణాలను ఆలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ ‌రూంలో భద్రపరిచి…ఈ పక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఆభరణాలను వేరేచోటుకి తరలించనున్నారు. జగన్నాథుడి దర్శనాన్ని భక్తులు రెండు అంచెల్లో చేసుకుం టారు. కొన్నిసార్లు నాట్యమండపం దగ్గరే భక్తులను ఆపేస్తారు. మరికొన్నిసార్లు  జగన్మో హనం వరకూ పంపిస్తారు. ఆ పక్కనే రత్నభాండారం ఉంది. ఇక్కడ మూడు చాంబర్లుం టాయి.

మొదటి చాంబర్లో… రెగ్యులర్‌గా స్వామివారికి వినియోగించే నగలుం టాయి. ఏడాదికి ఐదుసార్లు వీటిని స్వామివారికి అల• •రిస్తుంటారు.  భాండార్‌ అధిపతి దగ్గర ఈ తాళం ఉంటుంది. రెండో చాంబర్లో.. తలుపుకి మూడు తాళాలుంటాయి. ఓ తాళం గజపతి మహారాజుల దగ్గర, రెండో తాళం భాండార్‌ అధికారి దగ్గర, మూడో తాళం కలెక్టర్‌ ఆఫీసులో ఉంటుంది..ఈ మూడు తాళాలతో ఒకేసారి తెరవాలి. దీనికి ప్రభుత్వ అనుమతి కావాలి.. 1978లో ఆఖరిసారిగా తెరిచి లెక్కించారు.. 70 రోజుల పాటూ లెక్కించి ఆ జాబితాను సిద్దం చేశారు. అప్పటి నుంచి మూడేళ్లకో సారి తెరవాలని అనుకు న్నారు కానీ మళ్లీ తెరవలేదు. 2018లో కోర్టు, పురావస్తు శాఖ కూడా తెరవాలని చెప్పడంతో ఓ తాళం పోయిందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ రత్న భాండార్‌ 46 ‌సంవత్సరాల తర్వాత తెరిచారు. బయట గది పర్యవేక్షణ ముగించి ఆభరణాలను అక్కడి నుంచి తీసేసి ఖాళీ చేశారు.

లోపల గది తెరిచేందుకు ప్రయత్నించి ప్రయ త్నించి చివరకు విరగ్గొట్టి లోనికి ప్రవేశించినట్లు సీఏవో మరోసారి గుర్తు చేశారు. అయితే ఆరోజు సమయం సరిపోవకపోవడంతో ఆభరణాల తరలింపు పక్రియ చేపట్టకుండా ఆపేశారు. రాష్ట్ర ప్రభుత్వం  ఆమోదించిన మార్గ దర్శకాల ప్రకారం బయట, లోపల గదుల్లో ఉన్న ఆభరణాల తరలింపు పూర్తయ్యాక… మరమ్మ తుల కోసం  భారత పురావస్తు శాఖకి అప్ప గిస్తారు. పురావస్తు శాఖ మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత.. తాత్కాలిక స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో ఉన్న ఆభరణాలను తిరిగి రత్నభాండాగారంలోకి చేర్చేస్తారు.

జగన్నాథుడి సంపద గురించి ఆలయంలో… జయ విజయుల ద్వారం పక్కన గోడపై ఓ శాసనం ఉంటుంది. 1466లో ఎన్నో దండ ••త్రల తర్వాత గజపతి రాజులు అంతులేని సంపద ఆలయానికి తీసుకొ చ్చారని ఆ శాసనంలో ఉంది. ఆ తర్వాత ఎందరో మహా రాజులు జగన్నాథుడికి భారీ సం పదను సమకూర్చారు. ఇంకా పూరీ ఆలయంలో అనంతమైన సంపద ఉందని చెబుతూ ఎన్నో శాసనాలున్నాయి. ప్రస్తుతానికి ఆభరణాలు వేరేచోటుకి తరలించి… రత్న భాండాగారం మరమ్మతులు పూర్తయిన తర్వాత తిరిగి ఆభరణాలను అక్కడే భద్రపరచనున్నారు…

Leave A Reply

Your email address will not be published.