- సివిల్ వర్కస్ టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలి
- జూబ్లీహిల్స్ సర్కిల్ లో పర్యటించిన కమిషనర్
జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలో చేపట్టిన వివిధ సివిల్ వర్కస్ టెండర్ల ప్రక్రియ ను వేగవంతంగా పూర్తి చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట సంబంధిత ఇంజనీరింగ్ అధికా రులను ఆదేశించారు.గురువారం జూబ్లీహిల్స్ సర్కిల్ లో కమిషనర్ పర్యటించి లోటస్ పాండ్, పాత్ వే, మంగోలియా బేకరీ వద్ద గల పార్క్, తదితరాలను పరిశీలించి ఆయా అధికారులకు పలు సూచనలు చేశారు.
లోటస్ పాండ్ లోని సివరేజ్ కనెక్షన్లను తొలగించాలని, నాలాలలో స్ట్రామ్ వాటర్, ఫ్లోటింగ్ మెటీరియల్ రాకుండా మెష్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. డ్యామేజ్ అయిన పాత్ వే లకు వెంటనే రిపేర్లు చేయాలని సూచించారు.మంగోలియా బేకరీ వద్ద నుండి రోడ్ నెంబర్ 44- 45 వరకు రోడ్డు, సీవరేజి పనులు చేపట్టడానికి సంబంధించిన సివిల్ వర్క్ టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగోలియా బేకరీ వద్ద గల పార్కులో సీవరేజి నీరు నిలుస్తున్నాయని, శాశ్వతంగా పరిష్కరి ంచేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికా రులకు ఆదేశించారు.
అంతేకాకుండా అట్టి స్థలంలో క్రీడా మైదానం ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. హైటెన్షన్ వైర్లు దిగువన గల అన్ని పార్కులను థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టాలని యుబిడీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ అనురాగ్ జయంతి, ఈఈ విజయ కుమార్, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, వాటర్ వర్కస్, స్పోర్టస్, శానిటేషన్, ఇంజనీరింగ్, మెడికల్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.