భారీగా వొచ్చి చేరుతున్న వరదనీరు
శ్రీరాంసాగర్ జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భారీ వరద పోటెత్తింది. ఎగువ నుంచి 21,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లోలో 532 క్యూసెక్కులుగా ఉంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1069.50 అడుగులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం.90.31 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22.436 టీఎంసీలుగా ఉంది. అలాగే కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద స్వల్పంగా మొదలైందని అధికారులు తెలిపారు.
ఇన్ ఫ్లోలో 715 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నది. 17 టీఎంసీల నీటి సామర్థ్యానికి ప్రస్తుతం మూడు టీఎంసీలుగా ఉంది. ఇక శ్రీశైలం జలాశయానికి 1,73,504 క్యూసెక్కుల వరద వస్తున్నది. 1,21,171 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 255 టర్ల వద్ద నీటిమట్టం ఉండగా, 58.59 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.