A place where you need to follow for what happening in world cup

కాంగ్రెస్‌ పాలనతో మోదీ పాలనను పోల్చుకోండి

దేశం ఎంతగా పురోగమించిందో గమనించండి
మోదీ వొచ్చాకనే ప్రపంచంలో గుర్తింపు వొచ్చింది
దేశ అభివృద్ధ్ది కోసం బిజెపికి వోటేయాలి :  కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

గత కాంగ్రెస్‌ పాలనతో 10 ఏళ్ల మోదీ పాలనను పోల్చుకుని బిజెపికి వోటేయాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి వోటర్లను కోరారు. మోదీ వొచ్చాక 500 ఏళ్లుగా పెండిరగ్‌ లో ఉన్న సమస్యలను పరిష్కరించారన్నారు. మహిళలకు 33 శాతం కోటా ఇచ్చారని, హైవేలు నిర్మించారని, వ్యవసాయ వృద్ధికి సాయ మందించారని, అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారని అన్నారు. ఆయన డియా సమావేశంలో మాట్లాడుతూ అనేక అంశాలపై మాట్లాడారు. వారు పేదలకు బ్యాంకు ఖాతాలు ఎందుకు అని హేళన చేశారన్నారు. ప్రస్తుతం పేదలు దాదాపు రూ. 2 లక్షల కోట్లు పొదుపు చేశారు. గతంలో నిరర్ధక ఆస్తులు చాలా ఉండేవి. బిజెపి ప్రభుత్వం వచ్చాక 55 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు ఇచ్చామన్నారు.కాంగ్రెస్‌ హయాంలో ద్రవ్యోల్బణం 12శాతానికి పైగా ఉండేదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అత్యంత వేగంగా పతనం అవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఎన్టీపీసీ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి కేసీఆర్‌ హకరించలేదన్నారు. ప్రారంభోత్సవానికి మాత్రమే కేసీఆర్‌ వొచ్చారని తెలిపారు. ఆ తర్వాత ఎప్పుడూ కేసీఆర్‌ దానిని పట్టించుకోలేదని విమర్శించారు.

తండ్రీ, కొడుకులతోనే తెలంగాణ నాశనమయిందని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను చూసి జాలిపడాలన్నారు. ఓటమి తర్వాత కూడా ఆయన సీఎం అయినట్టు ఫీల్‌ అవుతున్నారని అన్నారు. పదేళ్లుగా దేశంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపైనే బీజేపీ ప్రచారం ఉంటుందని వెల్లడిరచారు. సీఎం కావాలనుకున్న కేటీఆర్‌ ఆశలయ అడియాశలు అయ్యాయన్నారు. అవినీతి ఆరోపణలు లేకుండా మోదీ పాలన సాగిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ పాలనలో కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యిందన్నారు. ప్రజల బ్రతుకులు మారలేదన్నారు. తాత్కాలికంగా వోట్లు పొందేందుకే కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నం చేసిందని విమర్శించారు. ప్రపంచానికే సాయం చేసే స్థాయికి భారత్‌ ఎదిగిందన్నారు. సంక్షేమం కోసం 34 లక్షల రూపాయలు ఖర్చు చేసింది మోదీ ప్రభుత్వమని తెలిపారు. దేశంలో డిజిటల్‌ విప్లవం తీసుకుని వొచ్చామని.. జీఎస్టీ వ్యాపారస్తులకు వరంగా మారుతోందన్నారు.

1.66 లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఏటా జీఎస్టీ ద్వారా దేశానికి ఆదాయం వొస్తుందన్నారు. 26,500 కోట్ల డిజిటల్‌ ట్యాన్జక్షన్స్‌ దేశవ్యాప్తంగా జరిగాయన్నారు. ఎంఎస్‌ఎంఈల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వొచ్చాయన్నారు. జనధన్‌ ఖాతాలతో 2 లక్షల కోట్ల రూపాయలు నేడు వారి సేవింగ్స్‌ అకౌంట్‌లలో జమ చేసుకున్నారన్నారు. పన్ను రాయితీ 7 లక్షల రూపాయలకు పెంచింది మోదీ ప్రభుత్వమని చెప్పారు. హైదరాబాద్‌ మెట్రోకు 12 వేల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేసిందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంతో ప్రమాదాలు తగ్గిపోయాయన్నారు. 20 వేల కిలోటర్ల మేర రైల్వే లైన్‌లకు విద్యుద్ధీకరణ పూర్తి అయ్యిందన్నారు. రోడ్‌ నెట్వర్క్‌లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నామన్నారు. 101 దేశాలకు కొరోనా వ్యాక్సిన్‌ అందజేశామని.. 411 కంపెనీలు దేశంలో సెల్‌ఫోన్‌ ఉత్పత్తి చేస్తున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.