A place where you need to follow for what happening in world cup

ఇరిగేషన్‌ రంగాన్ని సర్వనాశనం చేసిన కెసిఆర్‌

పంటల బీమా అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ
అబద్ధాలతో  మళ్లీ ప్రజల్లోకి వెళ్లిన కెసిఆర్‌
కరువు వొచ్చిందే బిఆర్‌ఎస్‌ పాలనలోనే అన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

కెసిఆర్‌ హయాంలో ఇరిగేషన్‌ రంగం సర్వనాశనం అయ్యిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. ఇరిగేషన్‌ రంగంలో కేసీఆర్‌ చేసిన దోపిడీ దేశంలో ఎవరూ చేయలేదన్నారు. జనగామ, సూర్యపేట జిల్లాలో కేసీఆర్‌ పర్యటించి,  కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శస్తూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్‌ కౌంటర్‌ ఇచ్చారు. నిన్న కేసీఆర్‌ అన్ని అబద్దాలే మాట్లాడారని మండిపడ్డారు. గాంధీ భవన్‌లో ఉత్తమ్‌ డియాతో మాట్లాడుతూ..  ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్‌ హయాంలో తెలంగాణకు ఎక్కువ ద్రోహం జరిగిందన్నారు. పోలీస్‌ శాఖను ఎక్కువ మిస్‌ యూజ్‌ చేసింది కేసీఆరే అని విమర్శించారు. పోలీసులు న్యూట్రల్‌గా ఉండాలని ఇప్పుడు కేసీఆర్‌ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కరువు వొచ్చింది బీఆర్‌ఎస్‌ పాలనలోనే అని… దాన్ని సమర్థవంతంగా డీల్‌ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో రైతులకు పంట బీమా కల్పించల ేదని…దేశంలో పంట బీమా కల్పించని ఏకైక సర్కార్‌ బీఆర్‌ఎస్‌ దేనని విమర్శించారు.

వరదలు, కరువుతో పంట నష్టపోతే.. ఒకటి రెండు చోట్లకు వెళ్లి కేసీఆర్‌ డ్రామా చేశాడని.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. మైక్‌ పనిచేయకుంటే కరెంట్‌ పోయిందంటూ కేసీఆర్‌ అబద్దాలు మాట్లాడారని.. పవర్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ చేసిందే లేదన్నారు. 24 గంటల పవర్‌ పాలసీని కొనసాగిస్తున్నాం.. రాష్ట్రంలో పవర్‌ కట్స్‌ లేవని స్పష్టం చేశారు.కాళేశ్వరం గురించి మాట్లాడటానికి కేసీఆర్‌కు సిగ్గుండాలి. తలదించుకోవాలి.. ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాళేశ్వరంలో కమిషన్ల కోసం అంచనాలు పెంచారని చెప్పారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పజెప్పిందే కేసీఆర్‌ అని నిప్పులు చెరిగారు. కేసీఆర్‌, జగన్‌ దోస్తీతో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. కృష్ణా నుంచి జగన్‌ అక్రమంగా నీళ్లను తరలిస్తున్నా కేసీఆర్‌ నోరు మెదపలేదని ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్‌ హయాంలోనే ఏపీకి ఎక్కువ నీళ్లు తరలి వెళ్లాయన్నారు.  కేసీఆర్‌ భయాందోళనలో ఉన్నాడు.. అందుకే పొలం బాట పట్టారని చెప్పారు.  కేసీఆర్‌ పొంకనాలకు పోయి పార్టీని నాశనం చేశాడని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లలోనే కుప్పకూలిందని.. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు.

ఇన్ని మాటలు మాట్లాడుతున్న కెసిఆర్‌ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతులకు పంట బీమా ఎందుకు కల్పించలేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగారు. దేశంలో పంట బీమా కల్పించని ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్సేనని ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల తరువాత బిఆర్‌ఎస్‌ కనుమరుగుకావడం ఖాయమని జోస్యం చెప్పారు. 24 గంటల పవర్‌ పాలసీ కొనసాగిస్తున్నామని, నిమిషం పవర్‌ కట్స్‌ ఎక్కడా లేవన్నారు. తెలంగాణ రైతాంగం, ఇరిగేషన్‌ను సర్వనాశనం చేసి వ్యక్తి కెసిఆర్‌ అని, అందుకు ఆయన సిగ్గుపడాలి, తలదించుకోవాలి, తెలంగాణ జనాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇరిగేషన్‌ రంగాన్ని కెసిఆర్‌ నాశనం చేయడంతో పాటు దోపిడీ చేశారని ఆరోపణలు చేశారు.

కాళేశ్వరం గురించి మాట్లాడేందుకు కెసిఆర్‌కు సిగ్గుండాలని, కాళేశ్వరంలో కషన్ల కోసం అంచనాలు పెంచారని, కళ్ల ముందే కాళేశ్వరం కుంగినా మాట్లాడటం మూర?త్వం కిందకు వస్తుందని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ మాట్లాడిన ప్రతి మాట అబద్దమే అని.. ఆయన డిప్రెషన్‌, ఫ్రస్టేషన్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు తప్ప బీఆర్‌ఎస్‌లో ఎవరూ మిగలరన్నారు. పదేండ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్‌ రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పచెప్తామని బీఆర్‌ఎస్‌ చీఫ్‌ ఒప్పుకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్‌ – జగన్‌ కలిసి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారని ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.