మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్ లోకి రావడం ఖరారయినట్లే. సెప్టెంబర్ 6న ఢిల్లీలో తుమ్మల జాయినింగ్ అవుతారని సమాచారం. రాహుల్ గాంధీ లేదా మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. ఈ మేరకు అయన ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు పెడుతున్నారు.
సీఎం కేసీఆర్ తీరుతో తీవ్ర అసంతృప్తితో తుమ్మల వున్న విషయం తెలిసిందే. కూకట్ పల్లి నుండి తుమ్మలని పోటీ చేయించే యోచనలో కాంగ్రెస్ వున్నట్లు సమాచరం. అయితే తాను పాలేరులో పోటీ చేస్తానని తుమ్మల అంటున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు,రేఖానాయక్ లు కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.