A place where you need to follow for what happening in world cup

జీవనానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి

సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలి
డా. బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో ఒక రోజు వర్క్ ‌షాప్‌లో సిఎస్‌ ‌పిలుపు

పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు. సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టిక్‌ ‌వినియోగం నిషేధంపై శనివారం డా.బీ.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో ఒకరోజు వర్క్ ‌షాప్‌ ‌జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పోల్ల్యూషన్‌ ‌కంట్రోల్‌ ‌బోర్డు చైర్మన్‌ ‌రాజీవ్‌ ‌శర్మ తోపాటు సచివాలయంలోని వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్న  ఈ వర్క్ ‌షాప్‌లో సిఎస్‌ ‌శాంతి కుమారి మాట్లాడుతూ..సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టిక్‌ ‌వస్తువుల స్థానంలో స్టీల్‌, ‌పింగాణీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్‌ ‌నిషేధంపై ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ…ప్లాస్టిక్‌ ‌నిషేధాన్ని సచివాలయ స్థాయిలో స్వచ్ఛందంగా పాటించడం ద్వారా ఆదర్శంగా నిలవాలని కార్యదర్శులకు సూచించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌లో కేవలం 9 శాతం మాత్రమే రీ-సైక్లింగ్‌ ‌జరుగుతుందని, మిగిలిన ప్లాస్టీక్‌ ‌వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీ జలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే, రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టిక్‌ ‌నిషేధంపై పౌరులను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. అదేవిధంగా, ప్రతీ గ్రామంలో చెత్త నుండి ప్లాస్టిక్‌ ‌వ్యర్దాలను వేరు చేస్తున్నామని వివరించారు. సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని సచివాలయంలో స్వచ్ఛందంగా నిషేధించి, ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా కార్యదర్శుల నుండి, ప్రతీ అధికారి, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. ప్రధానంగా, వాటర్‌ ‌బాటిళ్లు, కవర్లు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, స్ట్రాలలో ప్లాస్టిక్‌వి ఎక్కువగా వాడుతున్నారని, వీటి స్థానంలో స్టీల్‌, ‌పింగాణీ వస్తువులు వాడాలని కోరారు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది సాధ్యం కాదని, స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని అన్నారు.

కాలుష్య నివారణ మండలి చైర్మన్‌, ‌రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ ‌శర్మ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టీక్‌ ‌రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతతో వ్యక్తిగంతగా  కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌ ‌నిషేధంపై ఇప్పటికే జిల్లా స్థాయిలో కమిటీలున్నాయని, ప్రజా చైతన్య కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టాలని తెలియచేసారు. ప్లాస్టిక్‌ ‌వస్తువుల స్థానంలో వినియోగించే ప్రత్యామ్నాయ వస్తువులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను సిఎస్‌ ‌ప్రారంభించగా, ఈ వర్క్ ‌షాప్‌కు హాజరైన కార్యదర్శులు, ఉన్నతాధికారులు సందర్శించారు. ప్లాస్టిక్‌ ‌వినియోగాన్ని నిషేధించి భూమిని కాపాడుకుందాం… అనే నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను ఈ సందర్బంగా సిఎస్‌ ‌శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ ‌శర్మ ఆవిష్కరించారు.

Leave A Reply

Your email address will not be published.