కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న
దివంగత గద్దర్ తనయ వెన్నెల వెల్లడి
కాంగ్రెస్ నుంచి తాను టికెట్ ఆశిస్తున్నట్లు గద్దర్ కుమార్తె వెన్నెల తెలిపారు. టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తా..లేకున్నా ప్రచారం చేస్తానని అన్నారు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తన తల్లితో కలిసి వెన్నెల వి•డియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నాను. కానీ టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ కోసం పనిచేస్తా. ఎన్నికల్లో పోటీ చేయడానికి మేం సిద్దంగా ఉన్నాం. కొన్ని రోజులుగా నా పేరు వి•డియాలో వస్తోంది. రాజకీయాల్లోకి రమ్మని చాలా మంది నాపై ఒత్తిడి చేస్తున్నారు. నాకు కాంగ్రెస్ అవకాశం ఇస్తే పోటీ చేస్తాను. మాలో ప్రజల కోసం కొట్లాడాలనే్గ •టింగ్ స్పిరిట్ ఉంది. కంటోన్మెంట్ సీటు ఇస్తే అక్కడి కాంగ్రెస్ నాయకులను కలుపుకొని పని చేస్తా. మా నాన్న చివర్లో కాంగ్రెస్‌కి సపోర్ట్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ అన్నారు. ఓడిపోయినా సరే ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించారు. నాన్న ఆశయాన్ని నెరవేర్చడానికే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నా. గద్దర్ జీవితాంతం సమసమాజం కోసం తపన పడ్డారు. భారత రాజ్యాంగాన్ని అమలు పరచాలని గద్దర్ కోరుకునేవారు. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తామని కాంగ్రెస్ అంటోంది కాబట్టే కాంగ్రెస్‌కి మా మద్దతని వెన్నెల ప్రకటించారు. నా బిడ్డకి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు వి•డియాలో వస్తోంది. నా బిడ్డకి టికెట్ ఇస్తే ఆమె తరపున ప్రచారం చేస్తా. నా బిడ్డకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నా.‘ అని గద్దర్ భార్య విమల విజ్ఞప్తి చేశారు.