A place where you need to follow for what happening in world cup

తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్ట్ లో అందుబాటులోకి 800 మెగావాట్ల విద్యుత్తు

0 81
  • కమర్షియల్ ఆపరేషన్ ఆరంభం
  • తెలంగాణ రాష్ట్రానికే 85 శాతం విద్యుత్
  • వచ్చే నెల 3న వర్చువల్ గా జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ

రామగుండం ఎన్టిపిసి ఆధ్వర్యంలో నిర్మించిన తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో మొదటి దశలో చేపట్టిన 800 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు సంస్థ బుధవారం రాత్రి డిక్లరేషన్ ఆఫ్ కమర్షియల్ (సీఓడీ) ప్రకటించారు. వచ్చేనెల మూడో తేదీన నిజామాబాద్ పర్యటనకు వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా టి ఎస్ టి పి ని ఆరంభించి జాతికి అంకితం చేయనున్నారని సమాచారం. ఇక్కడ ఉత్పత్తి అయ్యే 800 మెగావాట్ల విద్యుత్తులో 85% రాష్ట్ర అవసరాల కోసమే వినియోగించనున్నారు. మిగతా పదిహేను శాతం విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలో రామగుండం ఎన్టిపిసి ఆధ్వర్యంలో 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నెలకొల్పాలని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రామగుండం ఎన్టిపిసి ఆవరణలో విద్యుత్ ఉత్పత్తి కోసం చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం మొదట 16 మెగావాట్ల విద్యుత్తు కోసం అగ్రిమెంట్ ఇవ్వడంతో మొదటి దశలో 800 మెగావాట్లు, రెండవ దశలో 800 మెగావాట్ల యూనిట్ల నిర్మాణానికి ఎన్టిపిసి చర్యలు చేపట్టింది. 2016లో గజ్వేల్ కు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్ట్ ( టిఎస్ టి పి) కు శంకుస్థాపన చేశారు. మొదటి, రెండవ దశ నిర్మాణ పనులు ఆరు మాసాల క్రితమే పూర్తయ్యాయి. మూడు మాసాల క్రితం మొదటి దశ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పడ్డ సాంకేతిక లోపాలను అధిగమించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత డిక్లరేషన్ ఆఫ్ కమర్షియల్ ను సంస్థ యాజమాన్యం ప్రకటించింది. దీంతో టి ఎస్ టి పి అధికారికంగా తెలంగాణ రాష్ట్రానికి 680 యూనిట్ల ( 85 శాతం) విద్యుత్తును సరఫరా చేయనున్నది.

రెండవ దశలో చేపట్టిన 800 మెగావాట్ల విద్యుత్ యూనిట్ పనులు ఇంకా నడుస్తున్నందున మరో రెండు మాసాల్లో ట్రయల్ రన్ చేపట్టి అందుబాటులోకి తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్టిపిసి వర్గాలు పేర్కొన్నాయి. టీఎస్ టిపీని వచ్చే నెల మూడో తేదీన నిజామాబాదు పర్యటనకు వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా జాతికి అంకితం చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.