- ముదిరాజులను బీసీ “డీ” నుంచి బీసీ “ఏ”లోకి మార్చాలి
- కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జనాభా ప్రామాణికంగా బీసీల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 40 శాతంకు పెంచాలని, ముదిరాజ్, తెనుగ కులస్తులను బీసీడీ లోంచి బీసీఏలోకి మార్చాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగుతులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అమలు చేసి, వారి అభివృద్ధికి బాటలు చేసేందుకు భారత రాజ్యాంగంలో పేర్కొన్న రిజర్వేషన్ల ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందించేందుకు కమినషన్లు వేసి, సిఫార్సులను అమలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వెనకబడిన కులాలు, అత్యంత వెనకబడిన కులాలకు జనాభా ప్రాతిపదిన రిజర్వేషన్లు అందకపోవడంతో రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 15(14), ఆర్టికల్ 16(4) ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన ప్రజలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు జనాభా ప్రాతిపదికన వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు ప్రస్తుతమున్న 25 శాతం రిజర్వేషన్లు 40 శాతానికి పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పకతప్పదన్నారు.
ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన ముదిరాజు కులాన్ని బీసీ-డీ కేటగిరిలో ఉండగా, తమను బీసీ-డీ కేటగిరి నుండి తమ సామాజిక, విద్యాపరంగా వెనకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని బీసీ-ఏ కేటగిరిలో చేర్చాలంటూ ముదిరాజ్ సంఘాల నాయకుల విన్నపాల మేరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ వెనకబడిన తరగతుల కమిషన్ ముదిరాజులు సామాజిక, విద్యాపరమైన స్థితిగతులు, ఉపాధి, జీవన విధానాన్ని అధ్యయనం చేసి, బీసీ-డీ కేటగిరి నుండి ముదిరాజు కులస్తులను బీసీ-ఏలో చేర్చాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా 2009లో ఉన్న సమయంలో వెనకబడిన తరగతుల కమిషన్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి, ముదిరాజ్లను బీసీ-డీ కేటగిరిలో నుండి బీసీ-ఏ కేటగిరిలోకి మార్చుతూ జీవో ఎంఎస్ నంబర్.
15 ద్వారా 2009న ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ముదిరాజులను బీసీ-ఏ కేటగిరిలో చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, తమ రిజర్వేషన్లు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ బీసీ-ఏలోని కొన్ని వెనకబడిన కులాల సంఘాల నాయకులు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ వెనకబడిన తరగతుల చట్టం 1993 ప్రకారం ఇట్టి మార్పు చట్టవిరుద్ధమని అంటూ ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ 2009న హైకోర్టును ఆశ్రయించగా బీసీ-ఏ కేటగిరిలో చేర్చడం నిలిపివేయగా… ముదిరాజు కుల సంఘాల నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ముదిరాజులు సామాజిక, విద్యాపరమైన, ఆర్థిక స్థితిగతులు, ముదిరాజ్ జీవన విధానం, వృత్తి, కష్టాలను అధ్యయనం చేసి, వారి సామాజిక, విద్యా పరమైన అభివృద్ధి మెరుగుపడేందుకు ప్రత్యేక కేటాయింపులు, ఉన్న పరిధి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వెనకబడిన తరగతులకు చెందిన ప్రభుత్వోద్యోగులు, పాక్షిక ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగుల వివరాలు సేకరించడంతో పాటు వెనకబాటుతనానికి కారణమైన అంశాలను వెనకబడిన తరగతుల కమిషన్ అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించగా ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో 9 నంబర్ 2021న ఏర్పడిన వెనకబడిన తరగతుల కమిషన్ ఈ అంశాలను పరిశీలిస్తుందని భావిస్తున్నానని అన్నారు.
రాష్ట్ర జనాభాలో సుమారు 55 నుండి 60 శాతం వెనకబడిన తరగతులకు చెందిన జానాభా ఉండగా, ప్రస్తుతం కేవలం 25శాతం రిజర్వేషన్లు బీసీ-ఏ 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ ఒక శాతం, బీసీ-డీ 7 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతుండడంతో నేటికి సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన కులాల జనాభా ప్రామాణికంగా రిజర్వేషన్లు అమలు చేయబడకపోవడంతో రిజర్వేషన్ల ఫలాలు ఆశించిన మేరకు అందడం లేదని, జనాభా ప్రామాణికంగా రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో సామాజికంగా, ఆర్ధికంగా, విద్యాపరమైన వెనకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకుంటూ ప్రస్తుతము ఉన్న 25 శాతం రిజ్వేషన్లను 40 శాతంకు పెంపు చేయాలని, తదనుగుణంగా వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందించేందుకు మార్గం సుగమం కావడంతోపాటు ముదిరాజ్ వెనకబడిన కులాలను ప్రస్తుతం కొనసాగుతున్న జాబితాలో నుండి మరో జాబితాలోకి చేర్చడంతో సంబంధింత జాబితాలలోని కులాలు పొందే రిజర్వేషన్లపై ప్రభావం పడకుండ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెనకబడిన తరగతుల కమిషన్ నివేదికను పరిగణలోకి తీసుకొని, తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన తరగతుల జాబితాలోని బీసీ-డీ గ్రూపు నుండి ముదిరాజు బీసీ-ఏ. జాబితాలో చేర్చేందుకు, బీసీ జనాభా ప్రాతిపదికన ప్రస్తుతమున్న 25 శాతం రిజర్వేషన్ను కనీసం 40 శాతానికి పెంచడంతో సంబంధిత కేటగిరీల్లో రిజర్వేషన్లు పెరగడం బలహీన వర్గాలు, సామాజిక, విద్యాపరంగా వెనకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ రాజ్యాంగంలో పేర్కొన్నవిధంగా వెనకబడిన తరగతుల ప్రజలకు రిజర్వేషన్ ఫలాలు అందించడం బాధ్యతగా గుర్తించి, రిజర్వేషన్ల పెంపునకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.