తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగస్టులో కురిసిన వర్షాలతో హైదరాబాద్ సహా తెలంగాణలోని జిల్లాలన్నీ వణికిపోయాయి. వాగులు, వంకలు పొంగాయి. చెరువు కట్టలు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు వరదలో కొట్టుకుపోయారు. ఈ బీభత్సం మరువకముందే.. మళ్లీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మళ్లీ జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ జిల్లాలో వాగులు వకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు కూడా నిండిపోయాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తింది. ప్రస్తుతం శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు 75వేల 100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. వరద అంతకంతకూ పెరుగుతుండటంతో.. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. 16 గేట్లు ఎత్తి 64వేల 38 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టులో మొత్తం 90 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. అయితే పెద్దఎత్తున వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఫుల్ అయ్యింది. దీంతో గేట్లు ఎత్తక తప్పలేదు. ఇక, జిల్లాలోని మరో జలాశయమైన రామడుగు ప్రాజెక్టులో కూడా వరద పెరుగుతోంది. 12వేల 285 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో… రామడుగు ప్రాజెక్టులో నీటిమట్ట 1278.3 అడుగులకు చేరింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టు అన్నింటిది ఇదే పరిస్థితి. ఏ జలశాయం చూసినా.. జలకళతో కళకళలాడుతోంది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 29వేల 800 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టులో నాలుగు గేట్లు ఎత్తారు అధికారులు. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 17 టీఎంసీలకు చేరింది.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం కూడా అస్థవ్యక్తంగా మారింది. పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
కామారెడ్డి జిల్లాలోని గాంధారిలో 14.4 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 9.9, నాగిరెడ్డిపల్లిలో 9.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో జుక్కల్-బస్వాపూర్ మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వాగులు-వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో.. పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొన్ని చోట్ల రహదారులపై కూడా వరద ప్రవహరిస్తోంది. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరో కొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది. జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. అనుకోని సంఘటనలు జరిగితే… వెంటనే సహాయకచర్యలు చేపట్టేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది.
ఇన్ని రోజులు ఉక్క ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ వాసులను ఇప్పుడు వానలు తడిసి ముద్ద అయ్యేలా చేస్తున్నాయి. ఆదివారం రాత్రి మొదలైన వర్షాలు ఇంకా వదలడం లేదు. ముసురులా పట్టుకుంది. వేకువజాము నుంచే మరింత ఉధృతంగా కురుస్తుంది.
రాత్రి నుంచి వానే వాన
రెండు రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షానికి హైదరాాబాద్‌లోని చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. అధికారులు అప్రమత్తమై నీటి నిల్వలేకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. సమస్య ఉంటే వెంటనే జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ 040-21111111కు లేదా 100కు, 9000113667కు ఫోన్ చేయాలని అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. వర్షాలు కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని స్కూల్స్‌కు సెలవులు ప్రకటిస్తున్నట్టు విద్యా శాఖ ప్రకటించింది.
అలాంటి ఇలాంటి వాన కాదు. కుండలతో పోసినట్టు కురుస్తోంది. అక్కడా ఇక్కడా కాదు హైదరాబాద్ మొత్తంగా కురుస్తోంది. జనం ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి. అర్థరాత్రి నుంచి పడుతున్న వాన జనజీవనాన్ని స్తంభింప జేసింది. ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే వారు అష్టకష్టాలు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆటోలు, క్యాబ్‌లు బుక్ కావడం లేదు. బుక్ అయినా ఛార్జీల మోత మోగిస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో కూడా భారీగా వసూలు చేస్తున్నారు. రెగ్యులర్‌గా వసూలు చేసే ఛార్జీల నాలుగైదు రెట్లు డిమాండ్ చేస్తున్నారు. మెట్రో అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులు వ్యయప్రయాసలు కోర్చి ఆఫీసులకు చేరుకుంటున్నారు. మిగతా వారి పరిస్థితి వర్ణించడానికి మాటలు చాలవు అన్నట్టు ఉంది. సొంత వాహనాలు ఉన్న వారిది మరో కష్టం. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.ఎక్కడికక్కడ నిలిచిపోయిన నీటిలో ప్రయాణం ప్రమాదం అని తెలిసినా తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్తున్నారు. కొందరు తడుస్తూనే ఆఫీసులకు చేరుకుంటున్నారు.
ఎక్కడ ఏ రోడ్డు తెగి ఉంటుందో, ఏ మ్యాన్ హోల్ నోరు తెరిచి ఉందో అన్న భయంతోనే వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు. పరిస్థితి గమనించిన వాతావరణ శాఖ హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తోంది. ఈ రోజంతా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెబుతోంది. భారీగా పడుతున్న వర్షంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. మరికొన్ని ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి నీళ్లు చేరాయి. జీడిమెట్ల, మారేడుపల్లి, ఎల్బీనగర్, సాగర్ రింగ్‌రోడ్డు, హస్తినాపురం, నిజాంపేట, అల్విన్ కాలనీ, చిలకలగూడ, సికింద్రాబాద్, సోమాజీగూడ, ఖైరతాబాద్, అమీర్‌పేట, ప్రగతీనగర్, కూకట్‌పల్లి, అడ్డగుట్ట, కంటోన్మెంట్, బోయినపల్లి, కర్ఖానా, మెహదీపట్నం, టోలీచౌకి, షేక్‌పేట, మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్, మెట్టుగూడ, తార్నాక, ఉప్పల్, కోఠఈ, మలక్‌పేట, దిల్‌షుక్‌నగర్ ఇలా అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది.
హైదరాబాద్‌లోని వివిధప్రాంతాల్లో కురిసిన వర్షపాతం ఇలా ఉంది.
శేరిలింగంపల్లి – 14 సెం.మీ
మియాపూర్‌లో 14 సెం.మీ
కూకట్ పల్లి, హైదర్‌నగర్ – 12.7 సెం.మీ
రాజేంద్రనగర్ – 12 సెం.మీ
షేక్‌పేట -11.9 సెం.మీ
బోరబండ -11.6 సెం.మీ
మాదాపూర్ -10.7 సెం.మీ
రాయదుర్గం -10.1 సెం.మీ
ఖైరతాబాద్ -10.1 సెంమీ
గాజులరామారం- 10సెం.మీ
రాజేంద్రనగర్- 10 సెం.మీ
గచ్చిబౌలి- 9.6, సెం.మీ
బహదూర్‌పురా -8.2 సెం.మీ
చిలకలగూడ, ఆసిఫినగర్ -8.1 సెం.మీ
మరో రోజు జరా భద్రం
వర్ష బీభత్సం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తున్నట్లుగా తెలిపింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ సెలవు ప్రకటన వర్తిస్తుందని తెలిపింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు విరిగిపడ్డ చెట్లు, విద్యుత్‌స్తభాలు నెలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ సూచించింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ అల్లాడింది. వాన హోరుతో విలవిల్లాడింది. భారీ వర్షంతో నగరం నిలువెల్లా వణికింది. ఉదయం 4 గంటల 15 నిమిషాలకు మొదలైన వాన కంటిన్యూగా పడుతూనే ఉంది. భారీ వానతో నగర రోడ్లన్నీ జలమయం అయ్యాయి.ప్రధాన రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది.
దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లేలా చూస్తున్నారు.నగరంలోని మెహిదీపట్నం, టోలీచౌకి, షేక్‌పేట్, గచ్చిబౌలిలో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, రాజేంద్రనగర్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, హకింపేట్, బొల్లారం, అల్వాల్, చింతల్, కుత్బుల్లాపూర్, గాజులరామారం, జీడిమెట్లతో పాటు నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం పడింది.అత్యధికంగా మియాపూర్‌లో 14 సెం.మీ వర్షం కురిసింది. హైదర్‌నగర్‌లో 12.7 సెంటీమీటర్లు వర్షం నమోదైంది. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.భారీ వర్షాలపై అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ సమీక్ష చేపట్టారు. అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, అటు ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు మంత్రి తలసాని.హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్‌ఎంసీ అలర్ట్ జారీ చేసింది. మరో ఐదు గంటల పాటు భారీ వర్షం పడే అవకాశముందని హెచ్చరించింది. హైదరాబాద్‌కు రెడ్‌అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ..ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. మరోవైపు సహాయక చర్యలు చేపడుతున్నాయి DRF బృందాలు.
మేయర్ సందర్శన
గరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో కురుస్తున్నవర్షాల నేపథ్యంలోనే మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక భారీ వర్షం కారణంగా న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ కింద భారీగా నీరు చేరింది. ఇక ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా విజయవాడ-హైదరాబాద్ హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కీలోమీటర్ల మేర వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.మంగళవారం (ఈరోజు) ఉదయం నుంచి నగరంలోని అమీర్‌పేట్, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, ఈసీఐఎల్, సికింద్రాబాద్, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, సుచిత్ర, కొంపల్లి, నిజాం పేట, కూకట్‌పల్లి, మియాపూర్, బీహెచ్‌ఈఎల్, గచ్చిబౌలితో పాటు మెహదీపట్నంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్సాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ఆఫీసులకు బయలుదేరిన ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.ఇదిలా ఉంటే మంగళవారం తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే 11 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తతో ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి వెస్తునన్నందున మూసి పరివాహక ప్రాంతాలు లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా సమస్య ఉంటే జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 040- 21111111 నెంబర్ లేదా డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు. అలాగే ఈవీడీఎమ్ కంట్రోల్ రూమ్ 9000113667 నెంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.
అవపరమైతే తప్ప బయిటకు రావొద్దు
ప్రజలు అత్యవసరమైతేనే తప్పా బయటకు రావొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. భారీ వర్షాల వేళ జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, ట్రాన్స్ కో ఎండీ, ఈవీడీఎం డైరెక్టర్, హైదరాబాద్ కలెక్టర్‌తో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. చెట్లు, కొమ్మలు, కూలిన చోట నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్లు 040-21111111, 23225397లో సంప్రదించాలన్నారు. ప్రజలు ఇళ్ల వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలని ట్రాన్స్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులతో ట్రాక్స్‌కో సీఎండీ సమీక్షి నిర్వహించారు. విద్యుత్ పరికరాలకు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని…బయటకు వెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే సిబ్బందికి చెప్పాలని…లోతట్టు ప్రాంతాలు, భవనాల సెల్లార్లలో నీరు చేరితే సమాచారం ఇవ్వాలని కోరారు. అందించాలని కోరారు. ఏవైనా సమస్యలు కోసం 1912, 738207214, 7382072106, 7382071574 నంబర్లలో ఫిర్యాదు చేయోచ్చని తెలిపారు. విద్యుత్ సమస్యలను వాట్సప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా కూడా చెప్పవచ్చని వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, అల్వాల్, బాలాజీ నగర్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయం అయ్యాయ్. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచి పోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో రెండు గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీచేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.