బీఆర్ఎస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షుడు రాజేష్
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని మరో సారి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని బీఆర్ఎస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షుడు పోకబత్తిని రాజేష్ కోరారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూత్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గం కోసం నిరంతరం ఎమ్మెల్యే సైదిరెడ్డి చేస్తున్న కృషితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పధకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకవెళ్లాలని కోరారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీశిరెడ్డిల సహకారంతో నాలుగేళ్లలో నాలుగువేల కోట్లు తీసువచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
అంతకుముందు సుమారు 250 బైక్లతో నిర్వహించిన ర్యాలీని మున్సిపల్ చైర్మన్ జయబాబు, బీఆర్ఎస్ పట్టణ ఇంచార్జీ కొణతం సత్యనారాయణ రెడ్డిలు ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీదర్, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్బబు, మత్స్యశాఖ చైర్మన్ పేరబోయిన వీరయ్య, గ్రంధాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ్య, కౌన్సిలర్లు అలక సరిత, బాణోతు లలిత, వేమూరి నాగవేణి, బాష, ప్రధాన కార్యదర్శి చిత్తలూరిసైదులు, పట్టణ మహిళా అధ్యక్షురాలు కళావతి, నాయకులు రమేష్ బాబు, రమాదేవి, మల్లయ్య, వెంకటేశ్వర్లు, సుందరయ్య, ఆదిరెడ్డి, శ్రీను, రాములు తది తరులు ఉన్నారు.