A place where you need to follow for what happening in world cup

పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే

0 62
  • ఈనెల 29 తుంగతుర్తిలో వంద పడక ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి
  • తుంగతుర్తి ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్వం
  • ద పడకల ఆసుపత్రి నిర్మాణంలో ఆరు మండలాల పేద ప్రజలకు అందనున్న మెరుగైన వైద్యం

రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సారధ్యంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం నేడు అభివృద్ధిలో మొదటి స్థానానికి చేరుకుంటుంది ఈనెల 29న తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మంత్రి తన్నీరు హరీష్ రావు మరో మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ల చేతుల మీదుగా సుమారు 44 కోట్ల వ్యయంతో నిర్మాణం కానున్న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది . అనాదిగా తుంగతుర్తి ప్రాంతం సరి అయిన వైద్య సదుపాయాలు లేక పేద ప్రజానీకం ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఎంతో మంది అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయేవారు. తుంగతుర్తి నియోజకవర్గం లోని తిరుమలగిరి ,నాగారం, అరవపల్లి ,మద్దిరాల, నూతనకల్ ,తుంగతుర్తి మండలాల ప్రజానీకానికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే సుదూర ప్రాంతంలోని ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది.

ముఖ్యంగా గర్భిణీలకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి .ఆరు మండలాల్లోని మారుమూల గ్రామాలు తండాల నుండి పురిటి నొప్పులతో తుంగతుర్తి కి వచ్చినా ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యం లేక తిరిగి సూర్యాపేటకు వెళ్లాల్సి వస్తోంది. వంద పడకల ఆసుపత్రి తుంగతుర్తిలో ప్రారంభమైతే గర్భిణీ స్త్రీలకు అలాగే డయాలసిస్ వారికి అలాగే అనునిత్యం వివిధ జబ్బులతో బాధపడేవారు తరచూ జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడే క్షతగాత్రులకు, పాముకాటు లాంటివిష ప్రమాదాలకు గురైన రైతులకు, రైతు కూలీలకు అందరికీ మెరుగైన వైద్యం సకాలంలో అందుతుంది .తుంగతుర్తి లో ప్రస్తుతం 30 పడకల ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రం ఉన్న అందులో కావాల్సిన సదుపాయాలన్నీ లేక మారుమూల పేద ప్రజనికం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి చూసిన ఎమ్మెల్యే తన ఎన్నికల హామీలో వంద పడకల ఆసుపత్రిని మాటగా ఇచ్చారు.

ఆ హామీని నెరవేర్చడానికి ముందుగా ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రులకు పరిస్థితులు వివరించి ఎట్టకేలకు మంజూరి తెచ్చారు. సుమారు 44 కోట్ల వ్యయంతో నిర్మాణం కానున్న వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన ఈనెల 29న రాష్ట్ర మంత్రులు చేయనున్నారని వార్త పేద ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది .ఇప్పటికే ప్రతి మండలంలో పల్లె దావఖానాలు ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే, వాటిలో డాక్టర్లు ఉండేలా కృషి చేస్తున్నారు. 100 పడకల ఆసుపత్రి తుంగతుర్తి లో నిర్మాణం అయితే ప్రతి మండలం సుమారు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఏ రోగి అయినా సకాలంలో ఆసుపత్రికి చేరుకొని ప్రాణాలు కాపాడుకునే పరిస్థితిలు ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఇచ్చిన మాటకు కట్టుబడి 100 పడకల ఆసుపత్రిని నిర్మించడానికి రంగం సిద్ధం చేసిన తీరు యావత్తు తుంగతుర్తి ప్రజానికం ఎమ్మెల్యేకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు . ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేసి అనంతరం వాటి మాటే ఎత్తని నేతలు ఉన్న ఈ రోజుల్లో పేద ప్రజల ప్రాణాలు కాపాడే బృహత్తర కార్యమైన వంద పడకల ఆసుపత్రి నిర్మాణం అనే దశాబ్దాల కల నెరవేరుస్తున్న అటు ముఖ్యమంత్రి కేసీఆర్ ,ఇటు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ లు మరోమారు అధికారంలోకి రావాలనేది పేద ప్రజల మాట.

Leave A Reply

Your email address will not be published.