A place where you need to follow for what happening in world cup

దొరల రాజ్యాన్ని బొంద పెడతాం

  • తెలంగాణ భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు
  • అధికారంలోకి రాగానే పీవీ జిల్లాను ఏర్పాటు చేస్తాం
  • తోటపల్లి రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకుంటాం
  • కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయం
  • హుజరాబాద్, మానకొండూర్ విజయభేరి సభలలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

ఈ ఎన్నికల్లో దొరల రాజ్యాన్ని బొంద పెడతాం ప్రజాపాలన ఏర్పాటు చేస్తామని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం హుజరాబాద్, మానకొండూరు నియోజకవర్గాలలో ఏర్పాటుచేసిన విజయభేరి సభలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని తప్పు జరుగుతే జీవితాలు అంధకారం అవుతాయని అన్నారు. రాచరిక పాలనలో ఉండాలో ప్రజల ప్రభుత్వంలో ఉండాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ఎప్పుడు నియోజకవర్గాలను మారుస్తున్న కేసీఆర్ ను ఈసారి కామారెడ్డిలో బొంద పెట్టడం ఖాయమన్నారు. కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. అందుకు కృతజ్ఞతగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏమి చేసిందని అడుగుతున్నవ్ కదా కేసీఆర్ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టు, నాగార్జునసాగర్ డ్యాం, జూరాల ప్రాజెక్ట్, దేవాదుల ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్ లు కట్టింది కాంగ్రెస్ చింతమడకలో నువ్వు చదువుకున్న బడి కట్టింది కాంగ్రెస్ నువ్వు మొక్కే గుడి కట్టింది కాంగ్రెస్ నీ ఊరుకు రోడ్డు వేసింది కాంగ్రెస్ ఊరూరుకు కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ అంటూ విరుచుకుపడ్డారు.

హైదరాబాదులో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, శిల్పారామం, నెక్లెస్ రోడ్లు ఏర్పాటుచేసి విశ్వ నగరంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్పుకొచ్చారు. పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా తను మాత్రం పంజాగుట్ట సెంటర్లో 150 పడకలతో ఇల్లు నిర్మించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే మండలానికి 30 పడకల ఆసుపత్రి, జూనియర్ కాలేజ్, నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే పీవీ జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు. తోటపల్లి రిజర్వాయర్ ముంపు గ్రామాల బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపు ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం 400కే గ్యాస్ సిలిండర్ 4వేల రూపాయల పెన్షన్, మహిళలకు 2500భృతి, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందజేస్తామని చెప్పారు ఇవన్నీ అమలు కావాలంటే ఈనెల 30వ తారీఖున ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. వచ్చే నెల 9వ తేదీన అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని భీమా వ్యక్తం చేశారు. గొప్ప కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ప్రణవ్ ఉన్నత విలువలు కలిగిన రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ప్రణవ్ అని ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటుందన్నారు. ఉన్నత విద్యావంతుడు యువ నాయకుడు ప్రణవ్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సంపుకుంటారో సాదుకుంటారు అంటూ దొంగ ఏడుపులు ఏడ్చిన ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత కేంద్రం నుండి ఎన్ని నిధులు తీసుకువచ్చాడో హుజురాబాద్ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం కాంగ్రెస్ ను మోసం చేసిన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రసమయి తెలంగాణ పాటను దొర గడిలకు తాకట్టు పెట్టిండు రసమయి బాలకిషన్ ఎమ్మెల్యే అయ్యాక మానకొండూరు నియోజకవర్గం చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్లతో ఫామోజు కట్టుకున్నడే తప్ప పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇవ్వలేదన్నారు. నిజాయితీపరుడు ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కవ్వంపల్లి ని అత్యధికత మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాలలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం సిపిఐ జిల్లా కార్యదర్శి కొరివి వెంకటస్వామి తోపాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆనాడు సిద్ది పేటలో ఉన్న కేసీఆర్.. కరీంనగర్, పాలమూరు, గజ్వేల్ కు చేరాడు. ఇప్పుడు గజ్వేల్ ప్రజలను కూడా మోసం చేసి కామారెడ్డికి పారిపోయిండు పిల్లి తావులు మార్చినట్లు కేసీఆర్ సీట్లు మారుస్తుండు కామారెడ్డిలో కేసీఆర్ ను బొందపెట్టుడు ఖాయం రసమయి ఉన్నది మూడు అడుగులు.. కానీ ఆరడుగులు దుంకుతడు. రసమయి ఎమ్మెల్యే అయ్యాక ఈ ప్రాంత ప్రజలకు చేసిందేం లేదు. ఆయన ఫామ్ హౌస్ కట్టుకుండు తప్ప ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు. తెలంగాణ పాటను రసమయి దొర గడీల తాకట్టు పెటిండు. కేసీఆర్ నకిలీ వంద రూపాయల నోటు లాంటివాడు. నకిలీ నోటు జేబులో ఉన్నా దానికి విలువ ఉండదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ మండలంలో జూనియర్ కాలేజీ, నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తాం తోటపల్లి రిజర్వాయర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తాం మీ ఆలోచనలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఈ వేదిక నుంచి కేసీఆర్ కు చెబుతున్నా.. బరాబర్ దొరల రాజ్యాన్ని బొంద పెడతాం.. ఇందిరమ్మ రాజ్యం తీసుకోస్తాం. మానకొండూర్ లో కవ్వంపల్లిని భారీ మెజారిటీతో గెలిపించండి కాంగ్రెస్ వస్తుంది.. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుంది…

Leave A Reply

Your email address will not be published.