- ఉప్పల్లో బండారి లక్ష్మారెడ్డి గెలుపు పక్క
- రోడ్ షోలో మంత్రి కేటీఆర్
ఈసీఐఎల్ కు మెట్రో రైల్ తెప్పిస్తానని, ఉప్పల్లో బండారి లక్ష్మారెడ్డి గెలుపు పక్క అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఉప్పల్ నియోజకవర్గ మల్లాపూర్, ఈసీఐఎల్ లో జరిగిన రోడ్ షోలో టిఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి తో కలసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో కరోనా వచ్చిన కారణంగా ఈసీఐఎల్ కు మెట్రో రైల్ తెప్పించలేకపోయామని, ఈసారి ఈ సెల్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ తప్పకుండా చేపడతామని స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో బండారు లక్ష్మారెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల ఆదరభిమానాలు చురగున్నారని, ఈ ఎన్నికల్లో ఆయనకే ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాలుగు కొత్త స్కీములు ప్రవేశపెట్టారని తెలిపారు.
ప్రధానమంత్రి మోడీ పెంచిన గ్యాస్ సిలిండర్ను 1200 నుంచి రూ.400 లకే అందజేస్తామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అన్నపూర్ణ పథకం కింద సన్న బియ్యం అందజేస్తామని తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి రూ.5 లక్షలు కేసీఆర్ బీమా పేరుతో అందజేయనున్నారని తెలిపారు. ఇక పించను రూ.2 వేల నుంచి ప్రతి ఏడాది పెంచుతూ రూ.5 వేలు అందజేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి ఆశీర్వదించాలని, ఉప్పల్లో భారీ మెజార్టీతో బండారు లక్ష్మారెడ్డి ని గెలిపించాలని కోరారు. ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరోసారి తెలంగాణ ప్రభుత్వం వస్తే తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప్పల నియోజకవర్గానికి మంత్రి కేటీఆర్ వరాల జల్లులను కురిపించారు. ఇక కేటీఆర్ రోడ్ షోను పురస్కరించుకొని ఈసీఎల్ చౌరస్తాలో భారీ లేజర్ షో , బాణ సంచను కాల్చి సంబరాలు నిర్వహించారు. కుండపోత వర్షం కురుస్తున్న టిఆర్ఎస్ శ్రేణులు చూపిస్తున్న ఆధార అభిమానం పాటికి ఎంతో అండగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎన్నికలు ఇంచార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.