అర్హులకు ఇల్లు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారని నిరసన
తుంగతుర్తి: అర్హులకు ఇల్లు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారని తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో గృహలక్ష్మి పథకంపై తీవ్రత స్థాయిలో నిరసన వ్యక్తం అయింది .ఇల్లు లేని తమకు ఇల్లు ఇవ్వకుండా ఇల్లు ఉన్న వారికే ఇచ్చారని మహిళలు నిరసన వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా మహిళలు ఇల్లు వచ్చిన వారి పేర్లకు పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు .ఏకంగా తుంగతుర్తిలో లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడానికి వస్తున్న ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున రాగా పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు .ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఇల్లు వచ్చిన వారిలో అర్హులే లేరని అర్హులైన తమకు ఇండ్లు రాలేదని విమర్శించారు. తమ ఇండ్లు అడగడానికి వస్తే అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.