వలసలను ఆపలేక అయోమయంలో కాంగ్రెస్ క్యాడర్
హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులతో ఆకర్షితులై చింతలపాలెం గ్రామం నుండి మాజీ ఎంపీటీసీ అమరబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏఐటియుసి ఆటో యూనియన్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఇంటింటికి అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసి తాము ఆయన నాయకత్వంలో పనిచేయాలని బిఆర్ఎస్ లో చేరామని చేరినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీలో అంకితభావంతో సైనికుల్లా క్రమశిక్షణతో ఎల్లప్పుడూ పనిచేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో చింతలపాలెం జడ్పిటిసి చంద్రకళ సైదిరెడ్డి , సర్పంచ్ ఆయేషా అమీర్ సాబ్, కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు.