సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తలసాని మంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు మారెడ్ పల్లిలోని మంత్రి తలసాని నివాసం వద్ద కోలాహలం నెలకొంది. సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తలసాని పేరు ఖరారు కావడంతో మంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దల ఎత్తున చేరుకున్నారు.
సనత్ నగర్ నియోజకవర్గం నుండే కాకుండా నగరం నలుమూలల నుండి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ కాలనీల అసోసియేషన్ ల ప్రతినిధులు వచ్చారు. డప్పు చప్పుళ్ళు, బాణసంచా కాల్చి, నృత్యాలు చేస్తూ సంబురాలు నిర్వహించారుర.