మహబూబ్ నగర్, జూలై 21:నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన కొమ్ము భీమమ్మ, కొమ్ము నరసింహులు బుధవారం బుధవారం ఇద్దరు భార్యాభర్తలు కలిసి పశువుల మేపడానికి అడవికి వెళ్లారు అనంతరం వీరిద్దరు సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఇంటికి బయలుదేరారు రెండు పశువులు తప్పిపోయావని తన భార్య భీమమ్మ ఆ పశువులు వెతుకుతూ తప్పిపోయింది. తన భార్య కనిపించిక పోవడంతో వంట చెరుకు కోసం ఉన్నాదేమోనని పశువుల వెంట ఇంటికి వచ్చాడు. అప్పటికి తన భార్య రాకపోవడంతో కొంత దూరం వెతకాడు అప్పటికి ఆమే ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే కొంతమంది గ్రామస్తుల సాయంతో అడవిలో వెతికారు రాత్రి కావడంతో ఆమే ఆచూకీ పూర్తిగా తెలియకపోవడంతో ఆందోళన చెందుతూ అందుబాటులో ఉన్న అటవీశాఖ అధికారులకు, పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు.
భీమమ్మ వద్ద ఉన్న ఫోన్ నెంబర్ సహాయంతో తన నెంబర్ను పోలీసులు లొకేషన్ గుర్తించి అటవీ శాఖ అధికారులు పోలీసులు కొంతమంది గ్రామస్తులు వెంటనే ఉదయం 20 మంది సిబ్బందితో కలిసి వెతుకుతుండగా అడవిలోని (పందిపాయ) వద్ద కు దొరికింది వెంటనే ఆమె రాత్రిపూట అడవిలో ఉండడంతో భయభ్రాంతులకు గురై భయంతో వణుకుతున్న తన భార్య భీమమ్మని చూసి కంటతడి పెట్టారు వెంటవెళ్ల సిబ్బంది వెంటనే ఆమెను అదుపులో తీసుకొని సురక్షితంగా సిద్దాపూర్ గ్రామానికి చేర్చారు. భీమమ్మ మాట్లాడుతూ ఈ రాత్రి నన్ను ఏ జంతువులు తినేస్తాయోనని చస్తూ బతికి బతకానని బోరుమని ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేసింది రాత్రి మొత్తం అరుస్తూ ఉంటే తన వద్దకు ఏ జంతువులు రావని ఉద్దేశంతో రాత్రి మొత్తం అరుస్తూ ఉన్నానని ఆమె తెలిపింది.