A place where you need to follow for what happening in world cup

కవి మల్లయ్యమహర్షిని సత్కరించిన మంత్రి    

కమాన్ పూర్:రంగనాయక రచయితల సంఘం అధ్యక్షుడు పిన్నింటి మహేందర్ రెడ్డి సంపాదకీయం లో వెలువడ్డ “అమృత వర్షిణి” పుస్తక సంకలనం ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హారిష్  రావు ఆవిష్కరించి మాట్లాడు తు నేడు జనం సోషల్ మీడి యా మోజులో పడటం వల్ల పుస్తక పఠనం చదువడం రానురాను తగ్గి పోయిందని కాని పుస్తక పఠనం వల్ల మనిషి జ్ఞానంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.

సిద్ధిపేటలోఆర్థిక,వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హారిష్ రావు క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో పుస్తక సంపాదకులు పిన్నింటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో “అమృత వర్షిణి” పుస్తక సంకల నంలో పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామ నివాసి రైతు, ప్రముఖ కవి, రచయిత, సామాజిక కార్యకర్త, డెమోక్రటిక్ జర్ణలిష్ణ్ ఫెడెరేషన్ రాష్ట్ర కార్యదర్శి,కూచన.

మల్లయ్య మహర్షి రాసిన “కలల అలలు” కవిత అచ్చైంది.ముఖ్య అతిథి మంత్రి తన్నీరు హారిష్ రావు చేతుల మీదుగ పుస్తకం  యిచ్చి శాలు వతో  సత్కరించి అభినందించా రు.ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలొ  అరువై మంది కవులు, కవయిత్రులు సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.