రాష్ట్ర ఐటి, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అక్టోబర్ 3 న రాష్ట్ర ఐ.టి, మున్సిపల్ శాఖ మంత్రి కే.టి.ఆర్.ధర్మపురిలో పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషా, ఎస్పి ఎగ్గడి భాస్కర్ తో కలిసి మాతా శిశు కేంద్రం, ఫైలాన్, హెలిప్యాడ్ కళాశాల మైదానాన్ని సందర్శించి పనులను పరిశీలించారు.
అలాగే నూతనంగా నిర్మాణం అవుతున్న పైలాన్ బహిరంగ సభా స్థలి, కావాల్సిన ఏర్పాట్లు, మాతా శిశు ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవాల్లో తీసుకువాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్, ఎస్పిలకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, దివాకర, డి.సి.ఎం.ఎస్. చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జెడ్పిటిసి బత్తిని అరుణ, మున్సిపాలిటి వైస్ చైర్మన్ రామన్న, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ చైర్మన్ సునీల్, తదితరులు పాల్గొన్నారు.