భారత హరితవిప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ మృతి పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. యావత్ దేశానికి తన పరిశోదనలతో ఎంతో సేవ చేసారని తెలిపారు.
ఆయన కృషితో నేడు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సాధించిన ఘనత స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తుందని కొనియాడారు. ఈ విషాద సమయంలో స్వామినాథన్ కుటుంభ సభ్యలకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేసారు.