రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరనగర్ కు చెందిన హైదర్ అనె వ్యక్తి తన ఇంటి వద్ద గంజాయి సాగు చేస్తున్నట్టు సమాచారం తెలవడంతో రూరల్ సీఐ సదన్ కుమార్ తన ఇంటి వద్దకు వెళ్లి 31 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం స్థానిక ఎస్ ఐ వెంకటేశ్వర్లు రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనమా చేసి గంజాయి మొక్కలను అక్కడ నుండి తరలించారు. యువత గంజాయి మత్తుకు బానిసై జీవితాలను నిర్మూలము చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాలు వాడకం రవాణా వంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.