న్యూదిల్లీ,ఆగస్ట్3: ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. వృద్దాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. దిల్లీలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆంధప్రదేశ్‌లోని మదనప్లలెలో 1940లో జన్మించారు.
యామినీకి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతంలో తితిదే ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. దిల్లీలో ’యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ స్థాపించి ఎంతో మంది యువతకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చారు. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ పేరుతో పుస్తకం రచించారు.