భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణం జనరల్ అసెంబ్లీ స్థానం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కోనేరు చిన్ని అలియాస్ కోనేరు సత్యనారాయణ కొనసాగుతున్నారు ఒకేసారి 115 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించి సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అదే దూకుడును కొనసాగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం దాకా అభ్యర్థుల పేర్లు ప్రకటించి హడావిడి సృష్టించిన ఆయన.. సాయంత్రం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని తన వద్దకు పిలిపించుకున్నారు. తనదైన ఓటు రాజకీయాలకు తెరదీశారు. అంతేకాదు ఎన్నికలకు ముందు కొత్తగూడెం కమలం పార్టీలో కల్లోలం సృష్టించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణం జనరల్ అసెంబ్లీ స్థానం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కోనేరు చిన్ని అలియాస్ కోనేరు సత్యనారాయణ కొనసాగుతున్నారు.
కోనేరు చిన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వియ్యంకుడు గరికపాటి వెంకటరావుకు దగ్గర బంధువు. తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చేముందే కొత్తగూడెం స్థానంపై చిన్ని కన్నవేశారు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా దీనికి ఓకే చెప్పింది. అయితే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలతో పొసగని కోనేరు చిన్ని అంటి ముట్టనట్టే ఉంటున్నారు. పైగా పార్టీ కార్యవర్గాన్ని కలుపుకోకుండానే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన వ్యవహార శైలి మీద భారతీయ జనతా పార్టీ పెద్దగా యాక్షన్ ఏమీ తీసుకోలేదు. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి వనమా వెంకటేశ్వరరావు పేరును వెల్లడించారు. వనమా వెంకటేశ్వరరావు బీసీ సామాజిక వర్గానికి చెందడంతో..
బిజెపి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే టికెట్ ఇస్తుందని పార్టీలోని కీలకవర్గాలు చెప్పడంతో కోనేరు చిన్ని తన దారి తాను చూసుకున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితికి చెందిన కొంతమంది కీలక నాయకులతో సంప్రదింపులు జరిపారని, వారు ఓకే చెప్పడంతో కోనేరు చిన్ని ప్రగతి భవన్ వైపు వెళ్లారని సమాచారం. నిన్న అభ్యర్థుల ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి తో సాయంత్రం కోనేరు చిన్ని భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె ఆయనకు కేసీఆర్ నుంచి బలమైన హామీ లభించిందని భారత రాష్ట్ర సమితి వర్గాలు అంటున్నాయి. అయితే ప్రస్తుతం కొత్తగూడెం టికెట్ వనమా వెంకటేశ్వరరావుకు కేటాయించిన నేపథ్యంలో కోనేరు చిన్ని కి ఎటువంటి పదవి ఇస్తారు అనే సంశయం అందరిలోనూ ఉంది.
ఈ స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన కుంచే వెంకట రంగా కిరణ్ కు భారతీయ జనతా పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసిందని సమాచారం. బీసీ సామాజిక వర్గంలో ఈయనకు మంచి పేరు ఉండటంతో భారతీయ జనతా పార్టీ ఆయన వైపు మొగ్గు చూపిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈయన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కొత్తగూడెం ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎటువంటి వివాదాలు లేని వ్యక్తి కావడంతో తన గెలుపు సులభం అవుతుందని రంగా కిరణ్ భావిస్తున్నారు. రంగా కిరణ్ కు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం ఓకే చెప్పిన నేపథ్యంలోనే కోనేరు చిన్ని గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.