సోమవారం ఉదయం నగరంలో వాన దంచికొట్టింది. కూకట్ పల్లి, కెపిహెచ్బి, నిజాంపేట, ప్రగతి నగర్ బాచుపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. . ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సాధారణ జన జీవనానికి అంతరాయం కలిగింది. సుమారు నెల రోజుల తర్వాత హైదరాబాదులో వర్షం కురిసింది. నిన్న మొన్నటి వరకు మొన్నటి వరకు ఉక్కపోత, ఎండలతో ఎండాకాలాన్ని తలపించిన నగర వాతావరణం ఒక్కసారిగా మారింది.
వానల నేపధ్యంలో ఐటీ కారిడార్ లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. రాయదుర్గం నుంచి హైటెక్ సిటీ మార్గంలో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొండాపూర్ హఫీజ్ కెట్ మార్గంలో కుడా ట్రాఫిక్ స్థంభించింది. పది నిమిషాల ప్రయాణానికి గంటకు పైగా టైం పడుతోంది. రోడ్లపై వాన నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కున్నారు.