భద్రాచలం: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం ఏజెన్సీ చర్ల మండలంలో జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉంజుపల్లి వద్ద సీఆర్పీఎఫ్ క్యాంపు ను తాలిపేరు బ్యాక్ వాటర్ చుట్టుముట్టింది. చర్ల మండల కేంద్రంలో వీధులు చెరువును తలపిస్తున్నాయి.
రానున్న ఇరవైనాలుగు గంటల్లో బారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ సమాచారం తో అధికారులు అలెర్ట్ అయ్యారు. మండలంలోని ముంపు ప్రాంతాల్లో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పర్యటించారు. తేగడ వద్ద తాలిపేరు వంతెన వద్ద వరద ప్రవాహం తీవ్రతను పరిశీలించారుర. గోదావరి పరివాహక ప్రాంతాల్లో గ్రామాలను సందర్శించి ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.