జగదేవపూర్ మండల పరిధిలో ని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయంలో గజ్వెల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార రథం ప్రారంభించారు. కొండపోచమ్మ నుండి చాట్లపల్లి వట్టిపల్లి మునిగడప గొల్లపల్లి జగదేవపూర్ భారీ బైక్ ర్యాలీతో కార్యకర్తలు మహిళలతో బయలుదేరారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గజ్వెల్ ఇక ధర్మ యుద్ధం మొదలయిందని అన్నారు. సీఎం కేసీఆర్ తో 20 సంవ త్సరాలు దోస్తీ చేశాను. అడుగులో అడుగు వేశాను, నా పని తనం తెలంగాణ ఉద్యమం సమయం లో చూశారు. ఆరోగ్య శాఖ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలు నా పని తనం చూశారు.
నాపైన ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకరాజకీయంగా ఖతం పట్టించించాలని రాజకీయంగా ఆరోపణలుసి చేసిన హుజు రాబాద్ రేషం గల బిడ్డను కాబట్టి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోయి ప్రజల ఆశీస్సులు, మద్దతుతో గెలిచానన్నారు. హుజురాబాద్ ప్రజలను ఆరు నెలల కాలం పాటుగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగం హుజూరాబాద్ ప్రజలను ఇంటింటికి ఎన్నెన్నో ప్రలోభాలు పెట్టిన దళిత బంధు పేరిట 10 లక్షల రూపాయలు ఇచ్చిన, గొల్ల కురుమ బిడ్డలకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చిన, ఒక్కో ఓటుకు 6,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చిన సీఎం కేసీఆర్ మోసాన్ని చూసిన ప్రజలు హుజురాబాద్ ప్రజలు ధర్మాన్ని గెలిపించాలని తెలిపారు.
ఆనాడు హుజరాబాద్ నుంచి నేను సవాల్ చేసిన.. బిడ్డ కెసిఆర్ గజ్వేల్ గడ్డ పైన వచ్చి నేను కూడా పోటీ చేస్తా అనిచెప్పిన మాటమీద భారతీయ జనతా పార్టీ నాకు గజ్వెల్ సిటు ఇచ్చి నాకు ఎంతో మేలు చేసిందని అన్నారు. పార్టీకి రుణపడి ఉంటానని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం లో కొండపోచమ్మ అమ్మవారు మహిమగల అమ్మవారు కాబట్టే అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించా అన్నారు. గజ్వేల్ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలని, మద్యం సీసాలకు డబ్బులకు లొంగవద్దని కోరారు. అనంతరంజగదేవపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికలకార్యాలయాన్ని ప్రారంభించారు. అదేవిధంగా బిజెపి ప్రభుత్వం వస్తే ప్రతి ఇంటికి రెండేసి పింఛన్లు, మహిళ గ్రూపులకు రుణాల మాఫీ చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు నాయకులు మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.