A place where you need to follow for what happening in world cup

ఎమ్మెల్యే మహిపాల్‌ ‌రెడ్డికి సంపూర్ణ మద్దతు పలికిన కాలనీల సంక్షేమ సంఘాలు

0 12,590
  • బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరిన రామచంద్రపురం కాంగ్రెస్‌ ‌నాయకులు
  • బిఆర్‌ఎస్‌ ‌పార్టీతోనే కాలనీల సమగ్ర అభివృద్ధి
  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి
  • ఆత్మీయ స్వాగతం పలికిన కాలనీల ప్రజలు

సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో పటాన్‌ ‌చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనప్పుడే పరిపూర్ణత సాధ్యమవుతుందని పటాన్‌ ‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి అన్నారు.రామచంద్రపురం డివిజన్‌ ‌పరిధిలోని శ్రీనివాస నగర్‌ ‌కాలనీ, మల్లికార్జున నగర్‌ ‌కాలనీ, శ్రీ సాయి నగర్‌ ‌కాలనీలలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలకు బిఆర్‌ఎస్‌ ‌పార్టీ పటాన్చెరు అభ్యర్థి, ఎమ్మెల్యే జిఎంఆర్‌, ‌శాసనమండలి మాజీ చైర్మన్‌ ‌భూపాల్‌ ‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీనివాస నగర్‌ ‌కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకులు శ్రీరాములు తన అనుచరులతో కలిసి బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు.

అనంతరం మల్లికార్జున నగర్‌ ‌కాలనీ, శ్రీ సాయి నగర్‌ ‌కాలనీలో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో ఎమ్మెల్యే జిఎంఆర్‌ ‌మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమానికి బిఆర్‌ఎస్‌ ‌పార్టీ చిరునామా అని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రతి గ్రామం, పట్టణాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు. రామచంద్రాపురం, భారతీ నగర్‌,‌పటాన్‌ ‌చెరు డివిజన్ల పరిధిలోని ప్రతి కాలనీలో మౌలికోస్తులు కల్పించడంతోపాటు అరుహులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లను సైతం అందించామని తెలిపారు. ఎన్నికల అనంతరం మిగిలిన అర్హులకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను అందించబోతున్నట్లు తెలిపారు.

పటాన్‌ ‌చెరు నియోజకవర్గం వ్యాప్తంగా కులం మతం ప్రాంతం తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఏకగ్రీవ మద్దతు పలుకుతున్నారని తెలిపారు.అనంతరం మల్లికార్జున నగర్‌ ‌సంక్షేమ సంఘం, శ్రీ సాయి నగర్‌ ‌కాలనీలా సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్‌ ‌కు ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పుష్ప నగేష్‌, ‌సింధు ఆదర్శ్ ‌రెడ్డి,  మాజీ కార్పొరేటర్‌ అం‌జయ్య, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సర్కిల్‌ అధ్యక్షులు పరమేష్‌ ‌యాదవ్‌,  ‌మార్కెట్‌ ‌కమిటీ డైరెక్టర్లు ప్రమోద్‌ ‌గౌడ్‌, ఐలేష్‌, ‌ప్రాంతాల సంస్థ డైరెక్టర్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌సీనియర్‌ ‌నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘం అధ్యక్షులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Epaper

X