గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ లో దారుణం..
మద్యానికి బానిసై.. రోజూ చిత్రహింసలు పెడుతున్న కొడుకును కన్న తండ్రే కడతేర్చాడు. క్షణికావేశంలో గొడ్డలితో నరికిచంపాడు ఆ తండ్రి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన కుంట సాయిలు కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు కుంట రమేష్ (30) మద్యానికి బానిసైన ఏ పని చేయకుండా తరచు కుటుంబ సభ్యులతో గొడవ గొడవపడేవాడు .
శనివారం ఉదయం కూడా ఇంట్లో గొడవ చేస్తుండడంతో విసుగెత్తి,సహనం కోల్పోయిన తండ్రి సాయిలు ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొని రమేష్ ను నరికేశాడు. దీంతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం పరుచుకొని, పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి సాయిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.