యాదాద్రి థర్మల్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ కి అనుమతుల పై కేంద్ర ప్రభుత్వ జాప్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ..
- ఉచిత విద్యుత్ ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింది
- మూడు గంటలు చాల అన్న కాంగ్రెస్ నాయకులు.. కరెంట్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం
- రాష్ట్రంలో ఎక్కడా వరి చేను, ఒక్క వరి కంకి ఎండిపోలేదు
- ప్రతిపక్షాలవి.. కావాలనే అబద్దపు, పసలేని ప్రచారం.
- మోడీ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా మొండి చేతులే చూపాడు.
-ఈ పర్యటనలోనైనా మోడీ ఆగిపోయిన యాదాద్రి విద్యుత్ ప్లాంట్ అనుమతులు ఇవ్వాలని డిమాండ్.
-కావాలనే ఆటంకాలు సృష్టించి అనుమతులు ఇవ్వడంలేదు.
-తొమ్మిది నెలల్లో tor( టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ) ఇవ్వాలన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కేంద్రం బేఖాతర్ చేస్తుంది.
– నిర్మాణం పూర్థైన.. అనుమతులు రావడంలేదు.
– మోడీ జోక్యం చేసుకుని కేంద్ర మంత్రికి ఆదేశం ఇవ్వాలి.
– రాష్ట్రంలో మోదీ అడుగు పెట్టే ముందే ఆదేశాలు ఇచ్చి రావాలని డిమాండ్.
-మాటల్లో దేశ భక్తి చేతల్లో దేశ ద్రోహం చేస్తున్న మోడీ.
-అభివృద్ధి చెందుతున్న వారికి ప్రోత్సహం ఇవ్వకపోగా ఆటంకాలు కల్పిస్తున్నారు.
-రాష్ట్ర రైతాంగానికి గుండెకాయగా మారుతుందనే యాదాద్రి ప్లాంట్ పై కుట్రలు.
-తెలంగాణ ప్రజలు జరుగుతున్న కుట్రలను అర్ధం చేసుకోవాలి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ కి అనుమతుల ఇవ్వడం లో కేంద్ర ప్రభుత్వ చేస్తున్న జాప్యంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలోమండిపడ్డారు.సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి,ఉచిత విద్యుత్ ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింది అన్నారు.మూడు గంటలు చాల అన్న కాంగ్రెస్ నాయకులు. కరెంట్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు.రాష్ట్రంలో ఎక్కడా వరి చేను, ఒక్క వరి కంకి ఎండిపోలేదన్న మంత్రి,ప్రతిపక్షాలవి అబద్దపు, పసలేని ప్రచారం అని ఎద్దేవా చేశారు.
మోడీ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా మొండి చేతులే చూపాడన్నారు.ఈ పర్యటనలోనైనా మోడీ ఆగిపోయిన యాదాద్రి విద్యుత్ ప్లాంట్ అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కావాలనే ఆటంకాలు సృష్టించి అనుమతులు ఇవ్వడంలేదన్నారు.తొమ్మిది నెలల్లో tor( టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ) ఇవ్వాలన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కేంద్రం బేఖాతర్ చేస్తుంది ఆరోపించారు.నిర్మాణం పూర్థైనా.. అనుమతులు రావడంలేదన్నారు.మోడీ జోక్యం చేసుకుని కేంద్ర మంత్రికి ఆదేశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మోదీ అడుగు పెట్టే ముందే ఆదేశాలు ఇచ్చి రావాలని డిమాండ్ చేశారు.మాటల్లో దేశ భక్తి గురించి చెప్పే మోడీ చేతల్లో దేశానికి ద్రోహం చేస్తున్నడని అన్నారు.అభివృద్ధి చెందుతున్న వారికి ప్రోత్సహం ఇవ్వకపోగా ఆటంకాలు కల్పిస్తున్నారన్నారు.రాష్ట్ర రైతాంగానికి గుండెకాయగా మారుతుందనే యాదాద్రి ప్లాంట్ పై కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు.రాష్ట్రం పై జరుగుతున్న కుట్రలను తెలంగాణ ప్రజలు జరుగుతున్న కుట్రలను అర్ధం చేసుకోవాలి అని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.