- హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న పవన్
- ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మంగళగిరిలోని కార్యాలయానికి వెళ్లనున్న జనసేనాని
- రేపు అవనిగడ్డలో ప్రారంభంకానున్న వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రి రేపటి నుంచి ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి యాత్రను వపన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి ఆయన నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు.
మరోవైపు కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు వారాహి యాత్ర కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలో బహిరంగసభ జరగనుంది. 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 2వ తేదీన జిల్లా నేతలతో సమావేశంలో, 3న జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. 4, 5 తేదీల్లో పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. మరోవైపు టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఈసారి వారాహి యాత్రలో ఆ పార్టీ శ్రేణులు కూడా పాల్గొననున్నాయి. టీడీపీ, జనసేన కలయికతో ఈసారి వారాహి యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు.