న్యూఢిల్లీ జూలై 31:హర్యానా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చొక్కర్‌తో పాటు అతని కంపెనీలకు చెందిన ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. మనీల్యాండరింగ్ కేసులో ఆయన్ను విచారిస్తున్నారు. అయితే ఇవాళ ఆ ఎమ్మెల్యేకు చెందిన నాలుగు లగ్జరీ కార్లతో పాటు 14.5 లక్షల విలువైన జ్వలరీ, 5 లక్షల నగదును ఈడీ సీజ్ చేసింది. ఇండ్ల కొనుగోలుదారులన మోసం చేసినట్లు ఎమ్మెల్యే ధరమ్ సింగ్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ధరమ్ చోకర్ కుటుంబానికి చెందిన సభ్యులు సాయి అయినా ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతున్నారు.దాంట్లో మహిరా ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ కూడా ఉంది. సామల్కా, గురుగ్రామ్, ఢిల్లీ నగరాల్లో ఈడీ తనిఖీలు చేసింది. 1497 మంది కొనుగోలుదారుల నుంచి సుమారు 360 కోట్లు వసూల్ చేసినట్లు సాయి అయినా ఫార్మ్స్ కంపెనీపై గురుగ్రామ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.తనిఖీల సమయంలో చోకర్ కుటుంబసభ్యులు దర్యాప్తులో పాల్గొనలేదని ఈడీ పేర్కొన్నది.