A place where you need to follow for what happening in world cup

కమలం గూటికి జయసుధ

హైదరాబాద్, జూలై 31:ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు,  కేంద్ర మత్రి కిషన్ రెడ్డితో జయసుధ సమావేశం అయ్యారు. పార్టీలో చేరికపై వీరి మధ్య చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. గతంలో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సారి బీజేపీ తరపున ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.  2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ విజయం సాధించారు. తర్వాత ఓడిపోయారు. ఇక సైలెంట్ అయిపోయారు. వ్యక్తిగత సమస్యలతో కొన్నాళ్లుగా సినిమాలకూ దూరంగా ఉంటున్నారు. ఇటీవల మళ్లీ  యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో వైసీపీలోనూ చేరారు. గత ఎన్నికలకు ముందు  వైసీపీలో చేరారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి , కిషన్ చర్చలు జరపడంతో బీజేపీలోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది.జయసుధ చాలా రాజకీయ పార్టీలు మారారు.  దివంగత రాజకీయ నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయసుధను తమ పార్టీలోకి చేర్చుకున్నారు.

అలా 2009 లో కాంగ్రెస్ పార్టీలో చేరి తొలుత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. విషయం తెలిసిందే. ఆ తరవాత కొన్నాళ్ళకి టిడిపిలోకి చేరారు. గత ఎన్నికలకు ముందు  వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు.  అనారోగ్య సమస్యలతో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారులకు వైద్య సేవలు అందించడానికి ఒక ట్రస్ట్ ను కూడా ప్రారంభించి సేవలు అందిస్తున్నారు.  జయసుధ సినిమా నటిగానే కాకుండా.. సికింద్రాబాద్ చుట్టుపక్కల అత్యధికంగా ఉండే ఓ మతం అభిమానాన్ని పొందారన్న అభిప్రాయం ఉంది. అందుకే సికింద్రాబాద్, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఆమెకు మంచి ఆదరణ ఉందని భావిస్తున్నారు. గతంలో ముషీరాబాద్ నుంచి బీజేపీ తరపున సీనియర్ నేత కె. లక్ష్మణ్ పోటీ చేసేవారు.ఆయన ఇప్పుడు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

బీజేపీ బీసీ మోర్చాకు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదు. ఆయన లేకపోతే.. ఆయనకు బదులుగా బలమైన అభ్యర్థి జయసుధ అయితేనే  బాగుటుందని.. బీజేపీ వర్గాలు అంచనాకు వచ్చి ఆమెతో సంప్రదింపులు జరిపినట్లగా తెలుస్తోంది.  జయసుధ వైసీపీలో చేరినప్పటికీ ఆమె సేవలను ఉపయోగించుకోలేదు. కనీసం పార్టీ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని.. ఆ పార్టీలో లేనట్లేనని గతంలో వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ నుంచి  వైసీపీలో చేరిన చాలా మందికి పదవులు వచ్చాయి. ధర్టీ ఇయర్ ఫృధ్వీకి పదవి ఇచ్చారు కానీ మధ్యలో బయటకు పంపేయడంతో ఆయన సైడ్ అయ్యారు. తర్వాత పోసాని కృష్ణమురళి, అలీ, జోగి నాయుడుకు కూడా పదవులు వచ్చాయి. సీనియర్ నటుడు మోహన్ బాబు, జయసుధలను మాత్రం సీఎం జగన్ ఎందుకో పట్టించుకోలేదు.దీంతో వీరిద్దరూ వైసీపీకి దూరమయ్యారు.

Leave A Reply

Your email address will not be published.