పాడైపోయిన లడ్డులను భక్తులకు అందిస్తున్న ఆలయ అధికారులు
నిర్మల్ జిల్లా బాసర ఆలయం రోజుకో వివాదంలో తెరపై కి వస్తుంది. తాజాగా సరస్వతి అమ్మవారి అభిషేకం లడ్డూలకు ఫంగస్ వచ్చి కుళ్లిపోయిన, అలాగే భక్తులకు పంపిణీ చేస్తున్నారు.
సుమారు వేల సంఖ్యలో లడ్డూలు పాడైనట్లు తెలిసింది. ఒక్కో అభేషేకం లడ్డూ ధర 100 వరకు ఉంటుంది. గుట్టు చప్పుడు కాకుండా పాడైన లడ్డూలను అధికారులు మాయం చేసే ప్రయత్నం చేశారు.కొన్నింటిని చెరువులో పడేసి, మరి కొన్నింటిని సిబ్బంది మంట పెట్టీ నిప్పులో కాల్చేసినట్లు తెలిసింది.
మిగిలిన కొన్నింటిని అరబెట్టారు..
ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంతో ఆలయానికి సుమారు 4 నుండి 5 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగింది.