A place where you need to follow for what happening in world cup

ధరణి ఉండాల్నా ..రైతు బంధు వొద్దా ..?

  • 24 గంటలు కరెంట్‌ ‌వొద్దా ..కాంగ్రెసోళ్లు తీసేస్తామంటున్నరు ..ఆలోచించి వోటెయ్యండి
  • సునీత నా బిడ్డ, కోరిన కోరికలు తీరుస్తా..: ఆలేరు ప్రజా ఆశీర్వాద సభ లో సీ ఎం కేసీఆర్‌

‌రైతుబంధు గురించి కాంగ్రెస్‌ ‌నాయకుడు ఉత్తంకుమార్‌ ‌రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు వేస్ట్ అని ధరణి తీసేస్తామని అంటున్నారు.. దీనిని మీరు ఆమోదిస్తారని ప్రజల నిర్దేశించి కేసీఆర్‌ అనగా ఆమోదించమని ప్రజలు ముక్తకంఠంతో అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధును ప్రవేశపెట్టి రైతులకు ప్రతి ఏట పదివేల నుండి 16 వేలకు పెంచుతున్నామని తిని ఓర్వలేని వాళ్లు ఎత్తివేస్తామని అంటున్నారని, మరో నాయకుడు ధరణిని తొలగిస్తామని అంటున్నారని, ధరణి పోర్టల్‌ ‌ద్వారా రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర వారి అకౌంట్లో నేరుగా పడుతుందని ధరణిలో మోసాలు జరిగే అవకాశం తక్కువని రైతు వేలు వేస్తేనే భూములు అమ్మకాలు జరుగుతాయని మీ భూమిపై మీదే పెత్తనం అని అన్నారు. రెండుసార్లు ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన గొంగిడి సునీత నా బిడ్డ, కోరిన కోరికలు తీరుస్తా, ఆమె ఎక్కువ ఏం అడగలే అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి విచ్చేసిన ముఖ్యమంత్రి సాయి ప్రశాంతి ఎస్టేట్లో ఏర్పాటుచేసిన ఆరుట్ల ప్రాంగణంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇది మూడోసారి జరుగుతున్న ఎన్నికలని ప్రజలు ఆవేశంతో గాక మంచి ఆలోచనతో ఎన్నికలలో బ్రహ్మాస్త్రం లాంటి వోటును వేయాలని అన్నారు.

ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి పార్టీలు గతంలో మనకు ఏమి చేశాయని ఆలోచించి వోటు వేయాలని, 75 ఏళ్ల కాలంలో ఏ పార్టీలు ఏం చేశాయని నాకంటే మీకే ఎక్కువ తెలుసునని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాను ఎంతగానో కష్టపడ్డానని, తన వెన్నంటే ఉన్న నాయకులను పోలీసులు లాఠీలతో మోదారని జైల్లో పెట్టారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తాను ఉద్యమాలు చేస్తుంటే  కొన్ని పార్టీలు అడ్డుపడ్డాయని పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చూసి గిట్టని వారు, తెలంగాణ బిడ్డలను కన్నబిడ్డలుగా చూసుకుంటున్న బిఆర్‌ఎస్‌ ‌పార్టీని దెబ్బతీసేందుకు 10 ఏళ్లుగా అధికారం లేక అల్లల్లాడుతున్న కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దోపిడి దొంగల కంటే దారుణంగా దోచుకుంటారని, తెలంగాణ రాకముందుకు ఉండే పరిస్థితులు మళ్లీ ఏర్పడతాయని హెచ్చరించారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఆలేరు సాగునీరు, త్రాగునీరు లేక ఈ ప్రాంతం కరువుగా ఉండేదని పశువులకు గడ్డి లేక తప్పనిసరిగా కబేలాలకు తరలించవలసిన పరిస్థితి రైతులకు ఏర్పడిందని అన్నారు.

banner 2 photo1.jpg

ఒకప్పుడు పది ఎకరాల భూమి ఉన్న పిల్లనిచ్చేవారు కారని, నేడు 10 గుంటల భూమి ఉన్న పిల్లని ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని, యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవాలయం నిర్మాణంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని, ఎకరం రెండు కోట్ల పైగా ధరలు రావడంతో ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరిగిందని మిషన్‌ ‌కాకతీయ ద్వారా ఈ ప్రాంతంలో చెరువులలో పూడిక తీసి కాలేశ్వరం నీళ్లతో చెరువులు కుంటలు నింపడంతో ఇక్కడ పనులు లేక హైదరాబాదులో బతుకుతున్న రైతులు తిరిగి ఊర్లోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు.తెలంగాణ ఏర్పాటు కోసం తన వెన్నంటే ఉన్న గొంగిడి సునీత రెండుసార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని, కరువు నీలాగా ఉన్న ఆలేరును అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్లేందుకు నిధుల మంజూరుకు తనకు ఎన్నో వినతులు, విజ్ఞప్తులు చేసిందని అన్నారు. నా బిడ్డ సునీత అడిగిందే ఎక్కువ ఆమె అడిగినవి ఏది కాదనలేను అన్ని నెరవేరుస్తా అన్నారు.

ఎన్నికలవేళ ఎందరో వస్తుంటారని వారి మాటలు విని మోసపోవద్దని, ప్రజలు వోటు వేసే ముందు వారు చెప్తున్న మాటలను వినాలని నేను అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను తీసివేస్తారని, అలవి గాని ఆరు పథకాలను అమల్లోకి తెస్తామని అంటున్నారని, వాటిని నమ్మవద్దని కర్ణాటక ప్రజలు నమ్మి మోసపోయారని గుర్తు చేశారు. ఆరు పథకాలు అంటూ గ్యారెంటీ లేని పథకాలను చూసి మోసపోవద్దని, బతుకుతెరువు కోసం మన రాష్ట్రానికి వచ్చిన ఉత్తర ప్రదేశ్‌, ‌కర్ణాటక, రాజస్థాన్‌ ‌రాష్ట్రాలకు చెందిన పేదలు ఈ ప్రాంతంలో ఉపాధి పొందుతున్నారని, ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన నాయకులు మనకు నీతులు చెబుతున్నారని అన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అం‌దిస్తుంటే రేవంత్‌ ‌రెడ్డి మూడు గంటల విద్యుత్‌ ‌చాలని, కర్ణాటకలో ఐదు గంటల విద్యుత్‌ ఇస్తున్నామని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఒప్పుకున్నాడని తెలిపారు. 24 గంటలు ఇచ్చే బి.ఆర్‌.ఎస్‌ ‌ప్రభుత్వం కావాలా, ఐదు గంటలు ఇచ్చే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రావాలా అని ముఖ్యమంత్రి అనరుదాంతో ప్రజలు 24 గంటల విద్యుత్‌ ‌కావాలని చేతులెత్తి ఆయనకు మద్దతు పలికారు.

ఆలేరు నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని రాబోయే రోజులలో గంధ మల్ల రిజర్వాయర్‌ ‌తో ఈ ప్రాంతం పాడిపంటలతో సత్యసామలమవుతుందని ఒకప్పుడు ఆలేరులో 27, ఎకరాలు సాగులో ఉంటే నేడు రెండు లక్షల పదిహేడు వేల ఎకరాలు సాగులోకి వచ్చాయని, రాష్ట్రంలో మూడు లక్షల టన్నుల నుండి 32 కోట్లు టన్నులకు పైగా వరి ధాన్యం పండించి దేశంలో మొదటి స్థానానికి ఎదిగినట్లు తెలిపారు.ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించేందుకు అశ్వరావు పెళ్లి కాలువ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో చెక్‌ ‌డ్యాములు కడతామని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపిస్తున్న గొంగిడి సునీత మహేందర్‌ ‌రెడ్డి కి అత్యధిక మెజార్టీ ఖాయమని, మూడోసారి గొంగిడి సునీత గెలుపుకు ప్రజలు సహకరించాలని, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్‌ ‌కు భవిష్యత్తులో ఆయనకు మంచి స్థానం కల్పిస్తామని అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ టికెట్‌ ఆశించి భంగపడ్డ కల్లూరు రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సమక్షంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అంతకుముందు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల కాలంలో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సహాయంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రతి గ్రామానికి సాగునీరు తాగునీరు ఇచ్చేందుకు కృషి చేశానని ఆలేరు, యాదగిరిగుట్టలో మున్సిపాలిటీల ఏర్పాటుకు కృషి చేశానని, వ్యవసాయ బాగుపడిందని, సాగునీరు ద్వారా యాసంగిలో 22 వేల ఎకరాల నుండి రెండు లక్షల పదహారువేల ఎకరాల సాగు విస్తీర్ణానికి సాగునీరు కల్పించినట్లు తెలిపారు. మెడికల్‌ ‌కాలేజీ, ఇండస్ట్రియల్‌ ‌పార్కు ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు, ప్రతి తండాకు నీరు అందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలేరుకు వస్తున్న సందర్భంగా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా తాను నాలుగు కోరికలు కోరనున్నట్లు తెలిపారు. ఆలేరును రెవెన్యూ డివిజన్‌ ‌కేంద్రంగా ప్రకటించాలని, వంద పడకల హాస్పిటల్‌ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని, కొలనుపాక గ్రామంలో ఉన్న పలు పురాతన ఆలయాలను పునరుద్ధరించి టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని, ప్రఖ్యాత సోమేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ప్రతి

మండలంలో జూనియర్‌ ‌కళాశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని, ఆలేరు మండలంలో దళిత బందు ద్వారా 1275 మందికి రుణాలు అందించగా, మిగిలిన 13,565 మందికి దళిత బంధు అమలు కు సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ‌భువనగిరి జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌ ‌రెడ్డి, ఆల్డా చైర్మన్‌ ‌పిచ్చి రెడ్డి, చింతకింది దినేష్‌, ‌డిసిసిబి చైర్మన్‌ ‌గొంగిడి మహేందర్‌ ‌రెడ్డి, మదర్‌ ‌డైరీ చైర్మన్‌ ‌లింగాల శ్రీకర్‌ ‌రెడ్డి, ఆలేరు మార్కెట్‌ ‌చైర్మన్‌ ‌మోత్కుపల్లి జ్యోతి, వైస్‌ ‌చైర్మన్‌ ‌పోరెడ్డి శ్రీనివాస్‌ ‌పిఎసిఎస్‌ ‌చైర్మన్‌ ‌మొగులగాని మల్లేష్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌చింతకింది చంద్రకళ మురారి, ఆలేరు మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌వస్పరి శంకరయ్య, వైస్‌ ‌చైర్మన్‌ ‌మొరిగాడి మాధవి వెంకటేష్‌, ‌పార్టీ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్‌ ‌గౌడ్‌ ‌తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.