ఈ నెల 29 అనగా నేడు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ,ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి లు పర్యటించనున్న నేపథ్యంలో మండల కేంద్రంలో సుమారు 44 కోట్ల రూపాయలతో నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మంత్రి పాల్గొననున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు గురువారం పరిశీలించారు.
హేలిప్యాడ్ ఏర్పాట్లతోపాటు ఆయా కార్యక్రమాలకు సంబంధించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.రేపటిలోగా ఏర్పాట్లన్ని పూర్తి చేయాలన్నారు. మంత్రి పర్యటన విజయవంతం అయ్యేలా అధికారులందరూ తమకు కేటాయించిన పనులను సమర్దవంతంగా సమన్వయంతో పని చేయాలన్నారు.కలెక్టర్ వెంటఅడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డీఎంహెచ్ ఓ హర్షవర్ధన్, తుంగతుర్తి ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్. డి సి హెచ్ ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్,తదితర అధికారులు పాల్గొన్నారు.