ప్రభుత్వ హాస్పిటళ్లలో మందుల కొరతతో పాటు సిబ్బంది సమస్యలు బాగా ఉన్నాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదని అన్నారు. బుధవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో జరిగిన సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ..వరుస వర్షాలతో వైరల్ ఫీవర్స్ వ్యాపిస్తున్నాయని..గ్రామాలకు వైరస్ పాకుతుందని అన్నారు. రోగులతో ప్రైవేట్ హాస్పిటళ్లు కిటకిట లాడుతున్నాయన్నారు. నిరంతరాయంగా వైద్య సిబ్బంది పని చేస్తేనే ప్రజల సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుందని తెలిపారు.
డయాగ్నస్టిక్ సెంటర్లలో కిట్స్ కొరత ఉందన్నారు. ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మెడికల్ కళాశాలల్లో టీచింగ్ స్టాఫ్ పూర్తిగా లేరన్నారు. మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్స్‌లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని ఈటల డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో కట్టడాలు కూలగొట్టడానికి ఓ పద్ధతి ఉంటుందన్నారు. అన్ని రంగాల్లో ఇచ్చిన హావి•లపై అతి తక్కువ కాలంలో విఫలమైన ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. కేసీఆర్ అహంకారం గురించి తెలుసుకోవడానికి ఆరేళ్ళు పట్టిందన్నారు. కాంట్రాక్టర్లకు మూడేళ్లుగా బిల్లులు ఇవ్వడం లేదని….పైరవీలు చేసుకునే పరిస్థితి వొచ్చిందని ఎంపీ ఈటల రాజేందర్ టారోపించారు.