ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టులలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు దగ్గర శుక్రవారం నాడు తుర్కపల్లి పోలీసులు పకడ్బందీగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు.
వాహనాలలో డబ్బుల సరఫరాను నివారించడంతోపాటు శాంతి భద్రతల దృశ్య ఈ తనిఖీలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఏసిపి కె శివరామిరెడ్డి. యాదగిరిగుట్ట రూరల్ సిఐ సురేందర్ రెడ్డి. తుర్కపల్లి ఎస్సై రాఘవేందర్ గౌడ్ తో పాటు ఏఎస్ఐలు. కానిస్టేబుల్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు….