A place where you need to follow for what happening in world cup

గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్న యువత

  • యువతను ఆకట్టుకుని తమవైపు తిప్పుకునే పనిలో అన్ని పార్టీలు
  • 18-29 వయస్సుగల ఓటర్లే ఎన్నికల్లో కీలకం

నవంబరు 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీ అభ్యర్థుల గెలుపు, ఓటములను యువత శాసించనుంది. యువతరంగం ఎటు మరలుతుందో అటు గెలుపు పవనాలు వీచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 18-29గల ఓటర్లు దాదాపుగా 40 శాతం మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో యువత ఈ ఎన్నికలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసి తన సత్తా చాటనుందనే వార్తలు
గుప్పుమంటున్నాయి.

వివరాల సేకరణలో అన్ని పార్టీలు

యువత ఓట్లు అసెంబ్లీ ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అధికార బి ఆర్ ఎస్, కాంగ్రెస్, బిజెపిలు ఇప్పుడు 18-29 సంవత్సరాల లోపు ఓటర్ల వివరాల సేకరణలో బిజీబిజీగా ఉన్నాయి.
వివరాల సేకరణకు అవసరమైన యంత్రాంగాన్ని అప్పుడే క్షేత్రస్థాయిలో దింపి పని కానిచ్చేస్తున్నారు. యువత ఎక్కువగా ఉద్యోగం, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉండడంతో అందుకు సంబంధించిన వివరాలు కూడా
తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే అధికార బి ఆర్ ఎస్ వంద ఓటర్లకు ఒక ఇంచార్జ్ ను నియమించగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కూడా యువత ఓట్లు కీలకమని భావించడంతో తదనుగుణంగా అందుకు సిద్దమౌతున్నాయి. అందుకే ఈ సారి అన్ని పార్టీల దృష్టి కూడా యువత ఓట్లవైపుకు మళ్ళిందని చెప్పవచ్చు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నియోజకవర్గాల వారిగా యువత ఓట్లు ఈ విధంగా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,35,221కాగా 18-19 సంవత్సరాల ఓటర్లు 4440, 20-29 సంవత్సరాల ఓటర్లు 42,362 ఉన్నారు.తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,48,556 కాగా 18-19 సంవత్సరాల ఓటర్లు 3985, 20-29 సంవత్సరాల ఓటర్లు 42627 ఉన్నారు.కోదాడ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,37,289 కాగా, 18 – 19 సంవత్సరాల ఓటర్లు 4263, 20-29 సంవత్సరాల ఓటర్లు 40092 ఉన్నారు.హుజురనగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,42,711 కాగా 18-19 సంవత్సరాల ఓటర్లు 5346, 20-29 సంవత్సరాల ఓటర్లు 43429 ఉన్నారు.నల్లగొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,37,866 కాగా 18-19
సంవత్సరాల ఓటర్లు 8254, 20-29 ఓటర్లు ఉన్నారు మిర్యాలగూడ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,25,626 కాగా 18-19 సంవత్సరాల ఓటర్లు 6952, 20-29 సంవత్సరాల ఓటర్లు 45635 ఉన్నారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,28,580 కాగా 18-19 సంవత్సరాల ఓటర్లు 7865, 20-29 సంవత్సరాల ఓటర్లు 46193 ఉన్నారు.దేవరకొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,41,467 కాగా 18-19 సంవత్సరాల ఓటర్లు 7555, 20-29 సంవత్సరాల ఓటర్లు 52282 ఉన్నారు.నకిరేకల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,44,467కాగా 18-19 సంవత్సరాల ఓటర్లు 7531, 20-29 సంవత్సరాల ఓటర్లు 47604 ఉన్నారు.భువనగిరి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,11,362 కాగా, 18-19 సంవత్సరాల ఓటర్లు 7338, 20-29 సంవత్సరాల ఓటర్లు 42750 ఉన్నారు.ఆలేరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,27,738 కాగా 18-19 సంవత్సరాల ఓటర్లు 7077, 20-29 సంవత్సరాల ఓటర్లు 44750 ఉన్నారు.

ఈ విధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 40 శాతంకుపైగా ఉన్న యువత ఓట్ల కోసం ఆయా పార్టీలు ఇప్పటినుండే గాలం వేసే పనిలో నిమగ్నమయ్యాయి. యువత ఓట్లు ఏ పార్టీకి గంపగుత్తగా పడతాయో ఆ పార్టీ సునాసయంగా విజయం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ యువత ఓట్లను బాగా రాబట్టుకుని విజయం సాధిస్తుందో నవంబరు 30న జరిగే ఎన్నికల
అనంతరం డిసెంబరు 3న జరిగే ఓట్ల లెక్కింపు అనంతరం తేలనుంది.

Leave A Reply

Your email address will not be published.