భీంగల్ ప్రాంత ప్రజల మదిలో ఉన్న చిరకాల కోరిక ఇది కాంగ్రెస్ హయాంలో మూత పడ్డ బస్ డిపోను కేసిఆర్ ప్రభుత్వం పున: ప్రారంభిస్తుంది బాజిరెడ్డి గోవర్దన్ సహకారంతో బస్ డిపో మళ్ళీ పునరుద్దరిస్తాం కొందరు కావాలని బస్ డిపో గురించి,నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై దుష్ప్రచారం చేస్తున్నారు వారిని నేను పట్టించుకోను..నా నియోజకవర్గ ప్రజలకు ఏమీ కావాలో అది చేస్తా
నేను వేసిన అభివృద్ది పనుల శిలాఫలకాలు చూడడానికే వాళ్లకు రెండేళ్లు పడుతది మళ్ళీ రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే..కేసిఆర్ ను ఆపే దమ్ము ఎవరికి లేదు – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్:బాల్కొండ నియోజకవర్గం భీంగల్ బస్ డిపోను పున:ప్రారంభించేందుకు శనివారం నాడు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ భీంగల్ లోని బస్టాండు మరియు బస్ డిపోను పరిశీలించారు..భీంగల్ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న తరుణంలో ఈరోజు బస్ డిపోను పరిశీలించడం ప్రజలందరి హృదయాల్లో ఎంతో సంతోషం నెలకొంది..1994 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి స్వయంగా వచ్చి భీంగల్ బస్ డిపోను ప్రారంభించారు.
2006 లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూత పడింది.ముఖ్యమంత్రి కేసిఆర్ గారి సహాయ సహకారాలతో ఈరోజు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టిఎస్ఆర్టిసి చైర్మన్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ప్రత్యేక చొరవ తీసుకొని పున ప్రారంభించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.భీంగల్ బస్ డిపో ప్రారంభంతో నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం మరియు బాల్కొండ నియోజకవర్గం ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకు రవాణా సౌకర్యం చాలా సులభంగా అవుతుంది.