- సోదర భావానికి వేదిక రక్షా బంధన్
- రాష్ట్ర ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి
ఆత్మీయతకు, అనుబంధాలకు ప్రతీక, సోదర భావానికి వేదిక రక్షా బంధన్ (రాఖీ పండుగ) పండుగ సందర్భంగా ప్రజలకు రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకునే రక్షాబంధన్ పర్వదినం సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని, జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నదమ్ములకు అనురాగంతో చేతికి రక్షాబందాన్ని కట్టడం గొప్ప సాంప్రదాయమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహత్తరమైన ఆత్మీయ పండుగ రక్షాబంధన్ అన్నారు.అట్లాగే ఈ సంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజలలో సహోదరతత్వాన్ని మరింత పెంచుతుందని ఆయన ఆకాంక్షించారు. అలాగే సీఎం కెసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వం మానవీయ పాలనే లక్ష్యంగా పనిచేస్తూ….అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం అన్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తూ…పెద్దన్న గా భరోసా ను అందిస్తున్నది మన సీఎం కెసిఆర్ నని వారిని మరోసారి మహిళలు ఆశీర్వదించాలని కోరారు. మరోసారి రాఖీ పండుగ ను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు.